రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఒక్కసారి కుదురుకుంటే.. మ్యాచ్ ప్రత్యర్థి చేతుల్లోంచి చేజారినట్లేనని అభిప్రాయపడ్డాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రీతిందర్ సింగ్ సోధి. 'హిట్ మ్యాన్.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు' అని పొగడ్తలతో ముంచెత్తాడు. కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో విరాట్, పుజారాలతో పాటు రోహిత్ శర్మ బ్యాటింగ్ కీలకంగా మారనుందని అన్నాడు.
ఓపెనర్‌గా వచ్చి.. అదరగొట్టి..
2013లో టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ.. వెస్టిండీస్‌పై రెండు వరుస సెంచరీలతో అదరగొట్టాడు. ఆ తర్వాత.. రెగ్యులర్‌గా టెస్టు జట్టులో లేకపోయినా 2019 నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఏడాది ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తి.. భారత్‌కు మంచి శుభారంభాలనందించాడు.