Rohit Sharma Ind Vs SA Test :: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సఫారీల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఇందులో కేఎల్ రాహుల్ (101), విరాట్ కోహ్లీ (76) మినహా తమ మెరుపులు చూపించినప్పటికీ మ్యాచ్‌లో భారత జట్టు గెలవలేకపోయింది. ఈ ఇద్దరి మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇక టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిటే స్కోర్ చేయగలిగాడు.
అయితే ఈ ఓటమి పట్ల నిరశ చెందిన మాజీలు, క్రికెట్ లవర్స్ భారత జట్టుపై విమర్శలు గుప్పించారు. ఓవర్సీస్ పిచ్‌లపై ఎలా ఆడాలనేది ఆటగాళ్లకు తెలియడం లేదని, పేస్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడ్డారంటూ వారిని ట్రోల్ చేయడం మొదలెట్టారు. అయితే తమకు విదేశాల్లో ఎలా ఆడాలో తెలుసని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో నాణ్యమైన ప్రదర్శన చేసిన ఘట్టాలు కూడా ఉన్నయంటూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ విమర్శకులకు గుర్తు చేశాడు.
" సౌతాఫ్రికాపై తొలి టెస్టులో ఇటువంటి ఫామ్‌ను కనబరిచాం. అయితే గతాన్ని మరిచిపోకూడదు. మేం ఆసీస్, ఇంగ్లాండ్‌లను వారి గడ్డపైనే ఓడించాం. సిరీస్‌లను కూడా గెలిచాం. ఒక సిరీస్‌ను అయితే డ్రా కూడా చేసుకున్నాం. మా బ్యాటర్లు, బౌలర్లు తమ సత్తా చాటారు. అయితే, కొన్నిసార్లు మనం ఇలాంటి ఫలితాలను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగని భారత్ వెలుపల బ్యాటింగ్ ఎలా చేయాలనేది మాకు తెలియక కాదు. ప్రత్యర్థులు అత్యుత్తమంగా ఆడితే వారు గెలుస్తారు. సౌతాఫ్రికాతో టెస్టులోనూ ఇదే జరిగింది. ప్రత్యర్థి బ్యాటర్లు 110 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మేం రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించలేకపోయాం. దీనిపై వ్యాఖ్యలు చేసే ముందు మేం పర్యటించిన గత నాలుగు సిరీస్‌ల గణాంకాలను కూడా ఓ సారి పరిశీలించాలి. బ్యాటింగ్, బౌలింగ్ రికార్డులు ఏంటో తెలుసుకోవాలి" అంటూ విమర్శకులకు రోహిట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.