తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ ఫ్యామిలీ ట్రిప్ కంప్లీట్ - త్వరలో జట్టుతో చేరనున్న కెప్టెన్!

Rohit Sharma Family Vacation : ఫ్యామిలీతో కలిసి ఇటీవల ట్రిప్​కు వెళ్లిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సోమవారం తిరిగి భారత్​కు వచ్చాడు. ఇక త్వరలోనే రోహిత్, టీమ్ఇండియా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.

rohit sharma family vacation
rohit sharma family vacation

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 7:17 PM IST

Rohit Sharma Family Vacation :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, క్రికెట్​కు కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో ఇటీవల ఇంగ్లాండ్ వెళ్లాడు. ఈ వెకేషన్​లో రోహిత్, తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి గడిపాడు. కాగా, సౌతాఫ్రికా పర్యటనకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రోహిత్, సోమవారం భారత్​కు బయల్దేరాడు. అతడు ఫ్యామిలీతో ముంబయి ఎయిర్​పోర్టులో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక రోహిత్ త్వరలోనే టీమ్ఇండియా జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ గత నాలుగు నెలల నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. 2023 ఆసియా కప్​, 2023 వన్డే వరల్డ్​కప్ టోర్నీల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలోనే భారత్, ఎనిమిదోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్​కప్​లోనూ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. కానీ, ఫైనల్​లో అనూహ్యంగా ఆస్ట్రేలియా చేతిలో ఓడి, రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మెగా టోర్నీలో హిట్​మ్యాన్ 11 ఇన్నింగ్స్​ల్లో 597 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్​గా నిలిచాడు.

India Tour Of South Africa : డిసెంబర్​లో టీమ్ఇండియా, సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. సఫారీ గడ్డపై టీమ్ఇండియా 3 టీ20, 3 వన్డే, 2 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో మూడు ఫార్మాట్​లకు ముగ్గురు కెప్టెన్​లను నియమించింది బీసీసీఐ. టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్​ కాగా, వన్డేల్లో భారత్​కు కేఎల్ రాహుల్, టెస్టుల్లో రోహిత్ శర్మ టీమ్ఇండియాను నడిపించనున్నారు.

Virat Kohli Break From White Ball Cricket :ఇక టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సఫారీ పర్యటనలో వైట్​బాల్​ క్రికెట్​కు దూరంగా ఉండాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాడు విరాట్. ఇక సఫారీలతో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్​లో యథావిధిగా ఆడనున్నాడు.

మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ - ఈ ఫొటో మెసేజ్​ ఏంటంటే?

'రోహిత్​'కు మెసేజ్ చేయాలని ఉంది - ఆ విషయంలో అతడికి థాంక్స్ చెప్పాలి

ABOUT THE AUTHOR

...view details