టీమ్ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత రెండున్నరేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న కార్తిక్ ఐపీఎల్ 2022లో ఆర్సీబీ తరఫున బరిలో దిగి సంచలన ప్రదర్శనతో టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. ఈ ఊపులోనే ఇటీవలే జరిగిన ఆసియాకప్‌తో పాటు ఇప్పుడు తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అతడికి స్థానం దక్కింది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటించిన వెంటనే ఫ్యాన్స్ తమ అంచనాలను, విశ్లేషణలను, సెంటిమెంట్స్‌ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. అయితే దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మలకు సంబంధించిన ఓ సెంటిమెంట్ భారత అభిమానులను ఆకట్టుకుంటుంది. అదేంటంటే..
15ఏళ్ల తర్వాత.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి దినేశ్ కార్తీక్.. దాదాపు 15 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాడు. 2007లో జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో 'అండర్ డాగ్స్'గా బరిలో దిగిన టీమ్ఇండియా జట్టులో వీరిద్దరు ఆడారు. అప్పుడు టీమ్ఇండియా గెలిచింది.