ఐపీఎల్-2021 సెకండ్ ఫేజ్(ipl 2021 schedule) రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్(mi vs csk 2021) మధ్య మ్యాచ్‌తో ఈ లీగ్ రెండో దశ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. నెట్స్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్లు చెమటోడుస్తున్నారు. ముఖ్యంగా ముంబయి-చెన్నై తొలి పోరు కోసం సిద్ధమవుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్‌లు సోషల్ మీడియాలో ఏం షేర్ చేశాయో చూద్దాం.
ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్ నెట్ సెషన్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్(sachin tendulkar latest news) సందడి చేశారు. ఆటగాళ్లకు సూచనలిస్తూ, వారితో సరదాగా గడిపారు. అలాగే విండీస్ విధ్వంసకర వీరుడు పొలార్డ్.. ప్రాక్టీస్ షురూ చేశాడు. కరీబియన్ లీగ్ ముగించుకుని వచ్చిన ఇతడు గురువారమే దుబాయ్‌లో అడుగుపెట్టాడు. అలాగే రోహిత్(rohit sharma practice)తో పాటు మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను విడుదల చేసింది ఫ్రాంచైజీ.
చెన్నై సూపర్ కింగ్స్
విండీస్ క్రికెటర్ బ్రావో, దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ దుబాయ్‌లో అడుగుపెట్టిన వీడియోను షేర్ చేసింది ఫ్రాంచైజీ. ఎమోజీలకు సంబంధించి ఆటగాళ్లు గేమ్ ఆడిన ఓ సరదా వీడియోను పోస్ట్ చేసింది. అలాగే ప్రాక్టీస్‌లో ధోనీ(dhoni practice for ipl 2021) ఆడిన అన్ని షాట్లను ఓ వీడియోగా రిలీజ్ చేసింది.