తెలంగాణ

telangana

ETV Bharat / sports

హిట్​మ్యాన్​ వరల్డ్​ కప్​ రికార్డుపై ఆ స్టార్ ప్లేయర్ ఫోకస్​ - కొడితే తొలి బ్యాటర్​గా! - రోహిత్ శర్మ సెంచరీ రికార్డ్​పై కన్నేసిన డీకాక్​

Rohit Sharma CWC Centuries Record : భారత కెప్టెన్​ రోహిత్ శర్మ ప్రపంచకప్​ వన్డేలకు సంబంధించిన ఓ రికార్డుపై కన్నేశాడు దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాటర్​. అతడు ఈ రికార్డును బద్దలు కొట్టాడంటే ఆ లిస్ట్​లో తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే ..

Rohit Sharma World Cup Centuries Record
Rohit Sharma CWC ODI Centuries Record

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2023, 1:50 PM IST

Rohit Sharma CWC Centuries Record : 2023 ప్రపంచకప్​లో భారత క్రికెట్​ జట్టు.. తమకు తిరుగులేదన్నట్లుగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆడిన ఏడు మ్యాచ్​లను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా సెమీస్​ రేసులో అడుగు పెట్టిన తొలి జట్టుగా రికార్డుకెక్కింది. ఇక టీమ్​ఇండియాలోని బ్యాటర్లు, బౌలర్లు ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థి జట్లపై విజృంభిస్తున్నారు. కెప్టెన్​ రోహిత్​ శర్మ అయితే సూపర్​ ఫామ్​లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో తలపడిన మ్యాచ్​ల్లో తప్ప మిగిలిన అన్నింటిలోనూ అద్భుతంగా ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్​తో భారత్​కు అదిరిపోయే శుభారంభాలు అందించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హిట్​మ్యాన్​కు సంబంధించి ఓ ప్రపంచకప్​ వన్డే రికార్డ్​ డేంజర్​ జోన్​లో పడనుంది. అదేంటంటే..

కొడితే రెండు.. లేదంటే ఒక్కటి!
హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ ప్రపంచకప్​ వన్డే టోర్నీకి సంబంధించి ఓ రికార్డుపై కన్నేశాడు దక్షిణాఫ్రికా స్టార్​ ఆటగాడు క్వింటన్ డికాక్​. అదే వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్​లో రోహిత్ శర్మ ఏకంగా 5 సెంచరీలతో విరుచుకపడ్డాడు. దీంతో ఒకే ప్రపంచకప్​లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్​గా రికార్డులోకెక్కాడు. అయితే ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టే పనిలో పడ్డాడు డీకాక్​.

ప్రస్తుతం జరుగుతున్న మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్​లు ఆడిన డీకాక్​.. ఏకంగా 4 శతకాలు కొట్టాడు​. రోహిత్​ శర్మ నిర్దేశించిన రికార్డుకు ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. డీకాక్​ కూడా ప్రస్తుతం మంచి ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. కాగా, ఈ స్టార్​ బ్యాటర్​ కనిష్ఠంగా ఇంకా 2 మ్యాచులు, ఒకవేళ ఫైనల్స్​కు చేరితే గరిష్ఠంగా 4 మ్యాచులు ఆడే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్​ల్లో గనుక అతడు రెండు సెంచరీలు బాదితే మాత్రం రోహిత్​ పేరిట ఉన్న ప్రపంచకప్ సెంచరీల(5 శతకాలు) రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఒక్క సెంచరీ చేసినా సమంగా రోహిత్​ సరసన నిలవటం పక్కా.

కింగ్​ బర్త్​డే రోజే 'సఫారీలతో సై'..
మరోవైపు భారత్ తన తదుపరి మ్యాచ్​ను నవంబర్​ 5న(ఆదివారం) కోల్​కతా వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్​లో దూకుడు మీదున్న ప్రత్యర్థి జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే సఫారీలతో భారత్​ ఆడుతున్న తొలి మ్యాచ్​ ఇదే. అయితే అదేరోజు కింగ్​ విరాట్​ పుట్టినరోజు కూడా కావడం విశేషం.

వరుస విజయాలతో భారత్​ కొత్త రికార్డు - అప్పుడు 8, ఇప్పుడు 7!

'భారత బౌలర్లకు స్పెషల్​ బాల్స్​ ఇస్తున్నారు- అందుకే వాళ్లు అలా!'

ABOUT THE AUTHOR

...view details