తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS WI: కోహ్లీ నాపై ఒత్తిడి లేకుండా చేశాడు: రోహిత్​ శర్మ - విరాట్ కోహ్లీ

Rohith sharma IND VS WI second T20: వెస్టండీస్​తో జరిగిన రెండో టీ20లో భారత జట్టు గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్​ రోహిత్​శర్మ. భువనేశ్వర్​ వేసిన 19 ఓవర్ మ్యాచ్​ విజయంలో కీలక పాత్ర పోషించిందని అన్నాడు. కోహ్లీ తనపై ఒత్తిడి లేకుండా చేశాడని పేర్కొన్నాడు.

rohit sharma
రోహిత్ శర్మ

By

Published : Feb 19, 2022, 10:42 AM IST

Updated : Feb 19, 2022, 12:02 PM IST

Rohith sharma IND VS WI second T20: వెస్టిండీస్​తో జరిగిన రెండో టీ20 విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్​ భువనేశ్వర్​ను కెప్టెన్​ రోహిత్​ శర్మ ప్రశంసించాడు. అతడు బాగా ఆడాడని కితాబిచ్చాడు.

"వెస్టిండీస్‌తో ఆడాలంటే ఎప్పుడూ భయమేస్తుంది. వాళ్లతో పోటీ అంటే కష్టంగా ఉంటుందని తెలుసు. అందుకు తగ్గట్టుగానే మేం సన్నద్ధమై బరిలోకి దిగాం. ఒత్తిడిలోనూ మా ప్రణాళికలన్నీ అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇక భువనేశ్వర్‌ బౌలింగ్‌ చేసిన 19వ ఓవర్‌ చాలా కీలకమైనది. అక్కడ అనుభవమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎన్నో ఏళ్లుగా అతడు అదే పని చేస్తున్నాడు. అతడి టాలెంట్‌పై మాకు నమ్మకం ఉంది"

-రోహిత్​ శర్మ

అనంతరం కోహ్లీ గురించి మాట్లాడుతూ.. "కోహ్లీ ఆటను ఆరంభించిన తీరు చూస్తే నాపైన ఒత్తిడినంతా తీసేసాడు. ఇది చాలా ముఖ్యమైన ఇన్నింగ్స్​. రిషభ్​ పంత్​, వెంకటేశ్​ అయ్యర్​లు అద్భుతంగా ఆటను ముగించారు. అయ్యర్​ ఎంతో విశ్వాసంతో ఆడాడు. చివర్లో అవసరం ఉంటే బౌలింగ్​ చేస్తానని చెప్పాడు. ఫీల్డింగ్​లో కొంచెం నిరాశపరిచాం. ఆ క్యాచ్​లు పడితే బాగుండేది. ఈ తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్తాం." అని రోహిత్​ అన్నాడు.

మ్యాచ్​ ఫలితం పక్కన పెడితే విండీస్​ బ్యాటర్లు బాగా ఆడారని రోహిత్​ శర్మ చెప్పాడు. పూరన్​, పొవెల్​లు మ్యాచ్​ను చివరి ఓవర్​ వరకూ తీసుకువచ్చారని అన్నాడు రోహిత్​. మెుదటి మ్యాచ్​ మిడిల్​ ఓవర్స్​​లో తాము నెమ్మదిగా ఆడామని దానిని ఇప్పుడు సరిచేసుకున్నామని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:IND VS WI: మూడో టీ20కు కోహ్లీ దూరం

Last Updated : Feb 19, 2022, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details