Rohit Sharma Comments On Chris Gayle Sixes Record :వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్పేరిట ఉన్న సిక్సర్ల రికార్డుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ. అతడి పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును తాను బ్రేక్ చేయడమా.. అలా చేస్తే బాగానే ఉంటుంది అంటూ నవ్వుతూ ఫన్నీ కమెంట్స్ చేశాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్లు చేశాడు హిట్‌మ్యాన్. అయితే ఇలా రికార్డులు బ్రేక్ వంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించని పేర్కొన్నాడు.
"ఒకవేళ గేల్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమైతే అది అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. అయినా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొడతానని అస్సలు అనుకోవట్లేదు. అయినా ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను. వినటానికి ఫన్నీగా ఉంటుంది".
- రోహిత్ శర్మ, టీమ్ఇండియా కెప్టెన్
Rohit Sharma Total Sixes :అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన బ్యాటర్‌గా విండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్ ముందంజలో ఉన్నాడు. మొత్తం 483 మ్యాచ్‌లు ఆడిన యూనివర్సల్ బాస్ ఏకంగా 553 సిక్స్‌లు బాదాడు. ఇక 446 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 539 సిక్సర్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంటే గేల్ రికార్డును బ్రేక్ చేసేందుకు కేవలం 14 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఈ రికార్డును గనుక హిట్‌మ్యాన్ అధిగమిస్తే తన పేరిట మరో ప్రపంచ రికార్డును లిఖించుకోనున్నాడు.
జట్టులో చోటు దక్కించుకునేందుకు..!
Rohit Sharma Cricket Records :2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. కెరీర్ ప్రారంభంలో జట్టులో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగ శ్రమించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చొరవతో ఓపెనర్‌గా ప్రమోట్ అయిన రోహిత్.. తక్కువ కాలంలోనే హిట్‌మ్యాన్‌గా ఎదిగాడు. అలా అద్భుతమైన ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా టీమ్ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వన్డే ఫార్మాట్లో ఏ ఆటగాడికి సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలను బాది రికార్డు సృష్టించాడు. మరోవైపు సిక్సర్ల విషయంలోనూ భారత ఆటగాళ్లందరి కంటే కూడా ముందు వరుసలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో వరుసగా.. 77, 280, 182 సిక్స్‌లు నమోదు చేశాడు.