తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా మాట్లాడిన రోహిత్

Rohit Sharma Captain: టీమ్​ఇండియా జట్టుపై బయట జరిగే చర్చలు పెద్దగా పట్టించుకోనని అన్నాడు భారత జట్టు సారథి రోహిత్ శర్మ. జట్టు సభ్యులంతా క్రికెట్​పైనే దృష్టి పెట్టాలని సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్​లో షేర్​ చేసింది బీసీసీఐ.

By

Published : Dec 12, 2021, 8:25 PM IST

rohit sharma
రోహిత్ శర్మ

Rohit Sharma Captain: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథి బాధ్యతల నుంచి విరాట్​ కోహ్లీని తప్పించి రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయంపై పలువురు సీనియర్ క్రికెటర్లు సహా చాలా మంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై భారత జట్టు కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

"భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇది ఎప్పుడూ ఉండేదే. దీనిపై కొందరు పాజిటివ్​గా మరికొందరు నెగటివ్​గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ, ఓ క్రికెటర్​గా ఇవన్నీ పట్టించుకోను. నా ఆటపైనే దృష్టి పెడతాను. ఇది నేను కెప్టెన్​గా చెప్పట్లేదు ఓ ప్లేయర్​గానే చెబుతున్నా."

--రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్.

జట్టుకు కూడా ఇదే సందేశం ఇస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఓ ముఖ్యమైన టోర్నీ జరుగుతున్నప్పుడు జట్టుపై చర్చలు బాగా జరుగుతాయని టీమ్​ సభ్యులకు తెలుసని అన్నాడు. 'బయట మాట్లాడుకునే అంశాలపై కాకుండా ఆటపైనే దృష్టి పెట్టాలి. పూర్తి విశ్వాసంతో గెలిచేందుకే ఆడాలి.' అని రోహిత్ శర్మ సూచించాడు. టీమ్​ఇండియా ప్రధాన హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రవిడ్ ఆటగాళ్లలో బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నాడు.

టీమ్​ఇండియా టెస్టు జట్టుకు రోహిత్ శర్మను వైస్​ కెప్టెన్​గా ఎంపికచేసింది సెలెక్షన్ కమిటీ. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ కోసం 18 మంది స్క్వాడ్​ను ప్రకటించింది. డిసెంబర్ 26న దక్షిణాఫ్రికా భారత్ సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి:

Gambhir on Kohli: 'కెప్టెన్ కాకపోయినా కోహ్లీ ప్రమాదకరమే'

ధావన్​కు కష్టమే.. రుతురాజ్, వెంకటేష్ అయ్యర్​​కు ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details