టీమ్‌ఇండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్‌శర్మ సమర్థవంతంగా నిర్వర్తించగలడని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్(Ian Chappell Rohit Sharma) అభిప్రాయపడ్డాడు. అలాగే టీమ్ఇండియాపై ప్రశంసలు కురిపించాడు.
ఆ బాధ్యతకు రోహిత్ సమర్థుడు: ఛాపెల్
టీమ్ఇండియాను ప్రశంసించాడు ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ ఛాపెల్(Ian Chappell Rohit Sharma). భారత జట్టు టెస్ట్ కెప్టెన్సీపై(Rohit Sharma test captaincy) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ బాధ్యతను రోహిత్‌శర్మ సమర్థంగా నిర్వర్తించగలడని అభిప్రాయపడ్డాడు.
"టీమ్‌ఇండియా అద్భుతమైన ఆల్‌రౌండ్ జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశాల్లో వరుస సిరీస్ విజయాలతో నిస్సంశయంగా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఆస్ట్రేలియాలో సిరీస్(team india australia tour) నెగ్గిన టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌లోనూ(team india england tour 2021) సత్తాచాటింది. సొంతగడ్డ పైనా అజేయంగా నిలిచింది. పటిష్ఠమైన రిజర్వ్ బెంచ్ టీమ్‌ఇండియా సొంతం. అశ్విన్‌ను తుదిజట్టులో చేర్చడానికి టీమ్‌ఇండియా మార్గం కనుగొనాలి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో భారత్‌కు రహానె వైఫల్యమే ప్రతికూలాంశం. సమర్థ సారథిగా రోహిత్ ఇప్పటికే ప్రశంసలు అందుకున్నాడు. టెస్టు జట్టు వైస్ కెప్టెన్సీ(Rohit Sharma test captaincy) బాధ్యతల్ని రోహిత్ సమర్థంగా నిర్వర్తించగలడు" అని ఛాపెల్ అన్నాడు.
ఇదీ చూడండి:IND Vs ENG: 'ఆఖరి టెస్టు రద్దు.. వారికి క్షమాపణలు చెబుతున్నా'