తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కెప్టెన్​గా రోహిత్ శర్మను​ తప్పించొచ్చు!​'

భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. టీ20 ఫార్మాట్​లో కెప్టెన్​గా రోహిత్​ శర్మను తప్పించొచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకు పలు కారణాలను వివరించాడు. అవేంటంటే?

SEHWAG
వీరేంద్ర సెహ్వాగ్

By

Published : Jun 27, 2022, 2:43 PM IST

కొద్ది రోజులుగా సరైన ప్రదర్శన చేయలేక ఇబ్బందులు పడుతున్న భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్​. టీ20 ఫార్మాట్​కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్​ శర్మను తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశం ఉందన్నాడు. దాని ద్వారా తనపై ఉన్న కెప్టెన్సీ పని భారం తగ్గి మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు సెహ్వాగ్​. ఓ స్పోర్ట్స్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించాడు.

"టీ20 ఫార్మాట్​కు కెప్టెన్​గా మరొకరి పేరు ఇండియన్​ టీమ్​ మేనేజ్​మెంట్​ ఆలోచనల్లో ఉంటే.. రోహిత్​ శర్మకు ఉపశమనం లభించినట్లే. అందుకు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అందులో ఒకటి పని భారం, వయసు వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని రోహిత్​ శర్మ అధిగమించవచ్చు. రెండోది.. టీ20 కెప్టెన్​గా మరొకరు నియమితులైతే.. రోహిత్​ శర్మకు తగినంత విశ్రాంతి లభించి.. టెస్టులు, వన్డేల్లో సమర్థమైన కెప్టెన్​గా రాణించే వీలుంటుంది."

- వీరేంద్ర సెహ్వాగ్​, మాజీ క్రికెటర్​

ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్​ ఉండాలనే విధానానికే మేనేజ్​మెంట్​ కట్టుబడి ఉంటే.. రోహిత్​ శర్మ ఒక్కడే దానికి సరైన వ్యక్తిగా కనిపిస్తున్నట్లు చెప్పాడు సెహ్వాగ్​.
మరోవైపు.. ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్​లో టీమిండియా తరఫున ఆడాల్సిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్లను ఎంపిక చేశారు. అందులో రోహిత్​ శర్మ, ఇషాన్​ కిషన్​, కేఎల్​ రాహుల్​ ఉన్నారు. రైట్​ హ్యాండ్​, లెఫ్ట్​హ్యాండ్​ కాంబినేషన్​ విషయానికి వస్తే.. రోహిత్​-ఇషాన్​, కేఎల్ ​రాహుల్​-ఇషాన్​లు మంచి ప్రదర్శన చేస్తారని చెప్పాడు సెహ్వాగ్. మరోవైపు.. యువ పేసర్​ ఉమ్రాన్​ మాలిక్​పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచకప్​లో బుమ్రా, షమీతో కలసి ఉమ్రాన్​ తప్పకుండా ఉండాలన్నాడు. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ఉమ్రాన్​ దీర్ఘకాలం సేవలందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇదీ చూడండి:ఆ ఘనత సాధించిన భారత ఏకైక కెప్టెన్​గా హార్దిక్​ పాండ్య

ఐర్లాండ్​తో మ్యాచ్​లో భువి అరుదైన రికార్డ్

ABOUT THE AUTHOR

...view details