ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా చెలరేగిపోయింది. నాగ్‌పుర్ వేదికగా ఎంతో ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌కు చుక్కలు చూపించింది. ఈ సక్సెస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే తొలి టెస్టు మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అదేంటంటే..
'నా ముఖం కాదు.. ముందు రిప్లేలు చూపించు'.. కెమెరామెన్‌పై రోహిత్ ఫుల్ సీరియస్! - ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రోహిత్ శర్మ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగందంటే?
ఆస్ట్రేలియా సెకెండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో అశ్విన్ వేసిన తొలి బంతికి పీటర్.. హ్యాండ్ స్కాంబ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి అతని ప్యాడ్‌కు తాకింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ కూడా ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం నాటౌట్ అని తల ఊపాడు. దీంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ కావాలని అడిగాడు.
అప్పుడు కెమెరామెన్ రిప్లే స్క్రీన్‌లను చూపించకుండా రోహిత్ శర్మను చూపించాడు. దీంతో రోహిత్ ఒక్కసారిగా.. "నా ముఖం కాదు.. ముందు రిప్లేలను చూపించండి" అన్నాడు. ఇది అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. రోహిత్ మాటలు విన్న తోటి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. రోహిత్ భాయ్ కెమెరామెన్‌ను మాములుగా ఆడుకోలేదుగా అంటూ కామెంట్లు పెడుతున్నారు.