Rohit Sharma Akash Ambani :2024ఐపీఎల్ వేలంలో ముంబయి ఇండియన్స్ తరఫున జట్టు యజమాని ఆకాశ్ అంబానీ, నీతా అంబానీ, గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధనె పాల్గొన్నారు. ఇక వేలంలో బ్రేక్ సమయంలో అక్కడున్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌లో ఒకరు 'రోహిత్కో వాపిస్ లావో' (రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ కట్టబెట్టండి) అని అరిచారు. దీంతో ముంబయి ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ కూల్‌గా స్పందించారు. 'చింతా మత్ కరో, వో బ్యాటింగ్ కరేగా' (చింతించకండి అతడు బ్యాటింగ్ చేస్తాడు) అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
'అతడు బ్యాటింగ్ చేస్తాడులే'- హిట్‌మ్యాన్ ఫ్యాన్ డిమాండ్‌కు అంబానీ రిప్లై - Rohit Sharma Mumbai Indians
Rohit Sharma Akash Ambani : ఐపీఎల్ వేలం బ్రేక్ సమయంలో ఇంట్రస్టింగ్ ఘటన జరిగింది. రోహిత్‌కు తిరిగి కెప్టెన్సీ అప్పగించండి అంటూ ఓ అభిమాని అరిచాడు.
Published : Dec 20, 2023, 11:04 PM IST
Rohit Sharma Chennai Super Kings :ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను ప్రకటించినప్పటి నుంచి, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫ్రాంచైజీ మారనున్నడని పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతోందంటూ సోషల్ మీడియాలో వార్త వైరలైంది. దీనిపై సీఎస్కే సీఈవో కాశీవిశ్వనాథన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ' మా ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్‌తో ట్రేడింగ్‌కు దూరంగా ఉంటుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం మేము ఆటగాళ్లను ట్రేడ్ చేయం. ముంబయి ఇండియన్స్‌తో ట్రేడింగ్ చేయడానికి మా దగ్గర ప్లేయర్లు కూడా లేరు. మేం ఎవరినీ సంప్రదించలేదు. మాకు అలాంటి ఉద్దేశం లేదు' అని తెలిపారు.
ముంబయి కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించడం హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చలేదు. సోషల్ మీడియా వేదికగా ముంబయి ఇండియన్స్‌కు వ్యతిరేకంగా అనేక పోస్ట్‌లు పెట్టారు. ఈ కీలక ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో ముంబయి ఇండియన్స్ అఫీషియల్ అకౌంట్‌ను లక్షల మంది రోహిత్ ఫ్యాన్స్ అన్‌ఫాలో కొట్టారు. ఇక ఈ విషయంపై తాజాగా ముంబయి పర్ఫార్మెన్స్ గ్లోబల్ హెడ్ మహేల జయవర్ధనె మరోసారి స్పందించాడు. ' ఈ నిర్ణయం చాలా కఠినమైనది. వాస్తవానికి ఇది ఎమోషనల్ మూమెంట్. ఫ్యాన్స్ అలా రియాక్ట్ అవ్వడానికి కూడా అర్థం ఉంది. ఈ నిర్ణయం పట్ల అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారనుకుంటా. కానీ, ఒక ఫ్రాంఛైజీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయం అలాంటిదే. వారసత్వ నిర్మాణంలో భాగంగానే రోహిత్ నుంచి హార్దిక్ కెప్టెన్ అయ్యాడు. రానున్న తరానికి రోహిత్ ముంబయికి నిర్దేశం చేయడం మాకు ముఖ్యం. అతడు టాలెంటెడ్' అని అన్నాడు.