Rohit Sharma 5th T20 Century:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20ల్లో 5 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ (121 పరుగులు, 69 బంతుల్లో: 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరంగం సృష్టించాడు. హిట్‌మ్యాన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం రోహిత్ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. మరో ఎండ్‌లో హిట్టర్ రింకూ సింగ్ (69 పరుగులు, 39 బంతుల్లో 6 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 212-4 భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ మలిక్ 3, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ దక్కించుకున్నారు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కష్టాల్లో పడింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (4), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. గత రెండు మ్యాచ్‌ల్లో హీరో శివమ్ దూబే కూడా (1) స్వల్ప స్కోర్‌కే ఔటయ్యాడు. ఇక మళ్లీ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ (0) మరోసారి నిరాశపర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే గాల్లోకి లేపి క్యాచౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.
కరీమ్ జనత్@36:ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన అఫ్గాన్ పేసర్ కరీమ్ జనత్ 36 పరుగులు సమర్పించుకున్నాడు. రోహిత్, రింకూ దెబ్బకు ఈ ఓవర్లో ఏకంగా 5 సిక్స్‌లు, 1 ఫోర్ వచ్చాయి. టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 36 పరుగులిచ్చిన మూడో బౌలర్‌గా కరీమ్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇదివరకు 2007లో స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్), 2021లో అఖిల ధనంజయ (శ్రీలంక) 36 పరుగులిచ్చుకున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్లు
- రోహిత్ శర్మ (భారత్)- 5
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా)- 4
- సూర్యకుమార్ యాదవ్- 4
ఈ ఇన్నింగ్స్‌లో నమోదైన పలు రికార్డులు