తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌ - టీ20 ప్రపంచకప్​ రోహిత్​ శర్మ

గాయం కారణంగా టీ20 వరల్డ్​ కప్​కు దూరమైన టీమ్​ఇండియా స్టార్​ బౌలర్​ బుమ్రా స్థానంలో ఎవరని జట్టులోకి తీసుకుంటారన్న అన్న విషయంపై కెప్టెన్‌ రోహిత్‌శర్మ స్పందించాడు. ఏమన్నాడంటే?

rohit sharma bumrah
rohit sharma bumrah

By

Published : Oct 5, 2022, 9:24 AM IST

Updated : Oct 5, 2022, 10:01 AM IST

టీ20 ప్రపంచకప్​కు ముందు భారత క్రికెట్​ జట్టుకు జస్ప్రీత్​ బుమ్రా దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అయితే ఈ స్టార్ బౌలర్​ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్న చర్చ సర్వత్రా మొదలైంది. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదని గావస్కర్​ లాంటి మాజీలు ఇటీవలే అభిప్రాయపడ్డారు. దీనిపై తాజాగా టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు.

"ఫలితంతో సంబంధం లేకుండా ఓ టీమ్‌గా మెరుగవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుందని మొదటి నుంచి చెబుతున్నాను. అన్నీ దేశాల జట్లు చాలా సవాళ్లతో కూడుకొని ఉన్నాయి. సూర్య ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది (నవ్వుతూ). ముఖ్యంగా బౌలింగ్‌పై దృష్టి సారించాల్సి ఉంది. ఇటీవలే రెండు నాణ్యమైన జట్లతో ఆడాము. కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాం" అని మ్యాచ్‌ తర్వాత రోహిత్ అన్నాడు.

"ప్రస్తుత ఎనిమిది మంది ప్లేయర్లు మాత్రమే ఆస్ట్రేలియా వెళ్లారు. అందుకే అక్కడ కొన్ని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఏర్పాటు చేశాం. ఏ కాంబినేషన్‌లో ఆడాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంది. బుమ్రా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. అందుకే ఆస్ట్రేలియాలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న బౌలర్‌ కోసం చూడాలి. ఆ బౌలర్‌ ఎవరన్నది తెలియదు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం" అని రోహిత్‌ స్పష్టం చేశాడు.

ఇంకా మాకు సమయం ఉంది: ద్రవిడ్​
భారత జట్టులో బుమ్రా స్థానంలో షమీని తీసుకుంటారన్న ప్రశ్నపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు. "మాకు అక్టోబర్ 15వ తేదీ వరకు సమయం ఉంది. షమీ స్టాండ్‌బైలో ఉన్న ప్లేయర్​. 14-15 రోజుల కొవిడ్ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే దాని గురించి మేం నివేదికలను పరిశీలించి అప్పుడు నిర్ణయిస్తాం" అంటూ చెప్పుకొచ్చాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్‌ 23న పాకిస్థాన్‌తో టీమ్​ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే అంతకంటే ముందు అక్టోబర్‌ 17, 19 తేదీల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో రెండు వార్మప్​ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఇవీ చదవండి:భారత్​ భారీ మూల్యం చెల్లించుకుంది: ఆకాశ్‌ చోప్రా

రూసో శతక మోత.. మూడో టీ20లో సఫారీల ఘన విజయం.. టీమ్ఇండియాకు పరాభవం

Last Updated : Oct 5, 2022, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details