Rohit Interviews Chahal: టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. యాంకర్‌గా మారి స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ద్వారా రోహిత్ పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
రోహిత్ : వన్డేల్లో వంద వికెట్ల మైలురాయిని చేరుకోవడం ఎలా అనిపిస్తోంది?
చాహల్ :'ఏ ఫార్మాట్లోనైనా వంద వికెట్లు పడగొట్టడమనేది గొప్ప అనుభూతి'
రోహిత్ : జట్టుకు దూరమైనప్పుడు ఏం చేసేవాడివి?
చాహల్ : జట్టులో స్థానం దక్కనప్పుడు నా బౌలింగ్‌లోని లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించే వాడిని. వేరే బౌలర్లు రాణిస్తున్న తీరుని గమనిస్తూ.. మెరుగయ్యేందుకు శ్రమించేవాడిని.
'నువ్వు జట్టులో కీలక ఆటగాడివి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆడు. త్వరలోనే ఐపీఎల్ మెగా వేలం కూడా ప్రారంభం కాబోతుంది. గుడ్ లక్'అని రోహిత్ చెప్పడంతో ఈ ఇంటర్వూ ముగుస్తుంది.
ఆదివారం (ఫిబ్రవరి 6న) వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో చాహల్ 4/49 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడు వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో భారత స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. చాహల్ 60 వన్డేల్లో 103 వికెట్లు పడగొట్టాడు.
మరో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 58 వన్డే మ్యాచుల్లోనే కుల్‌దీప్ వంద వికెట్లు తీయడం విశేషం.
ఇదీ చూడండి:'అదంతా నాన్సెన్స్.. వాళ్లిద్దరి మధ్య గొడవల్లేవు'