తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా బైబై!.. కొత్త బాస్​ ఎవరంటే?

Roger Binny become BCCI president
బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా బైబై

By

Published : Oct 11, 2022, 11:55 AM IST

Updated : Oct 11, 2022, 1:00 PM IST

11:45 October 11

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ

రోజర్​ బిన్నీ

బీసీసీఐ బాస్ గంగూలీ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరొస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. టీమ్​ఇండియా 1983 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధమైంది. గంగూలీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్న రోజర్ బిన్నీ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 18న ముంబయిలో జరిగే బోర్డు ఏజీఎమ్​లో బిన్నీ అధికారికంగా బోర్డు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, బిన్నీ గతంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు.

బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా మాత్రం అదే పదవిలో కొనసాగనున్నాడు. అయితే అతడు ఐసీసీ బోర్డ్‌లో భారత ప్రతినిధిగా గంగూలీ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఆశిష్​ శేలార్​ ట్రెజరర్​గా ఎంపిక కానున్నాడట. ఇక రాజీవ్​ శుక్లా వైస్​ ప్రెసిడెంట్​గా తన పదవిని కొనసాగించనున్నాడు. అభ్యర్థులందరు ఏకగ్రీవం అవుతారన్న బీసీసీఐ వర్గాలు ఏ పదవికి ఎన్నికలు జరగవని స్పష్టం చేసింది. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న గంగూలీ.... ఐపీఎల్​ ఛైర్మన్‌ పదవి చేపట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్ ఐపీఎల్​ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మ్యాచ్​ మధ్యలో అంపైర్​ను బూతులు తిట్టిన ఆసీస్​ కెప్టెన్.. వీడియో వైరల్​​

Last Updated : Oct 11, 2022, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details