తెలంగాణ

telangana

ETV Bharat / sports

T20 worldcup: పాక్​ జట్టుపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు - పాకిస్థాన్​పై రోజర్​ బిన్నీ కామెంట్స్​

టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్​ జట్టుపై కీలక కామెంట్స్​ చేశారు బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ. అలాగే అద్భుత ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తున్న పసి కూనలు ఐర్లాండ్​, జింబాబ్వేను ప్రశంసించారు.

Roger binny comments on Zimbabwe Ireland matches
పాక్​ జట్టుపై బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు

By

Published : Oct 28, 2022, 10:52 PM IST

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో సంచలనాలు నమోదవుతోన్నాయి. చిన్న జట్లు కూడా పంజా విసురుతున్నాయి. పసికూనలైన నమీబియా, స్కాట్లాండ్​, ఐర్లాండ్, జింబాబ్వే జట్లు ఛాంపియన్​ టీమ్స్​ను ఓడించి రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై బీసీసీఐ నూతన అధ్యుక్షుడు రోజర్​ బిన్నీ స్పందించారు. చిన్న జట్లైనా ఐర్లాండ్​, జింబాబ్వేపై ప్రశంసలు కురిపించారు. పసి కూనలను తక్కువగా అంచనా వేయొద్దని పెద్ద టీమ్​లకు హెచ్చరించారు. అలాగనే వరుసగా రెండు మ్యాచ్​ల్లో(టీమ్​ఇండియా,జింబాబ్వేపై) ఓడిపోయిన పాకిస్థాన్​ సెమీఫైనల్​ చేరుకోవడం కష్టమేనని పేర్కొన్నారు.

"టీ20 ప్రపంచకప్​లో జూనియర్ టీమ్​లు తమ సత్తా చాటుకోవడం విశేషం. జింబాబే, ఐర్లాండ్​ తమ బలాన్ని నిరూపించుకున్నాయి. దీనిని బట్టి ఇప్పుడు చిన్న జట్లను అంత తేలికగా చూడకూడదు. అవి తేలికగా ఓడించగలవు. నాకు తెలిసి పాకిస్థాన్​ సెమీఫైనల్​ చేరుకోవడం కష్టమని భానవిస్తున్నాను" అని వెల్లడించారు.

ఇదీ చూడండి:T20 worldcup: సికిందర్​ రాజా స్పిన్ మ్యాజిక్​ వెనక ఉన్నది ఇతడేనా?

ABOUT THE AUTHOR

...view details