తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉతప్ప.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా! - రాబిన్ ఉతప్ప డ్యాన్స్ వీడియో

టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తనలోని మరో టాలెంట్​ను బయటపెట్టాడు. తన భార్యతో కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోను నెట్టింట షేర్ చేశాడు.

Uthappa
ఉతప్ప

By

Published : May 18, 2021, 8:15 AM IST

Updated : May 18, 2021, 9:46 AM IST

టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప బ్యాటింగ్‌లో ఎలా చెలరేగుతాడో అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా అతడిలోని మరో టాలెంట్‌ బయటకు తెలిసింది. ఉతప్ప తన భార్యతో పాటు పలువురు స్నేహితులతో కలిసి ఓ పాటకు స్టెప్పులేశాడు. అందులో మాజీ టెన్నిస్ ప్లేయర్‌ శీతల్‌ గౌతమ్‌ కూడా ఉన్నాడు. కాగా, ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. "మీ భార్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మీరు కట్టుబడి ఉండాలి" అని ఉతప్ప ఆ పోస్టుకు వ్యాఖ్యాత జత చేశాడు.

ఐపీఎల్‌ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయాక ఉతప్ప సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తనలోని మరో నైపుణ్యాన్ని అందరికీ పరిచయం చేశాడు. దీనికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, టెన్నిస్‌ దిగ్గజం రోహన్‌ బోపన్న ఫిదా అయ్యారు. కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక కరోనా కారణంగా అనూహ్యంగా వాయిదా పడిన ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఉతప్ప చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. అయితే, ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌ మంచి ప్రదర్శన చేయడం వల్ల అతడికి అవకాశం దక్కలేదు. గతేడాది రాజస్థాన్‌ తరఫున ఆడిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌ ఈసారి చెన్నై జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Last Updated : May 18, 2021, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details