తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోడ్​ సేఫ్టీ సిరీస్​ రెండో సీజన్​ త్వరలో ప్రారంభం - రోడ్​ సేఫ్టీ సిరీస్​ 2022.

Road Safety World Series: రోడ్​ సేఫ్టీ సిరీస్​ రెండో సీజన్​ మే నెలాఖరులో ప్రారంభం కానుందని నిర్వహకులు వెల్లడించారు. హైదరాబాద్​, వైజాగ్, లఖ్​నవూ, ఇండోర్​ వేదికలుగా ఈ మ్యాచ్​లు జరుగుతాయని తెలిపారు.

road safety series
రోడ్​ సేఫ్టీ సిరీస్

By

Published : Feb 17, 2022, 4:37 PM IST

Road Safety World Series: అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు బరిలో దిగే 'రోడ్డు భద్రత ప్రపంచ సిరీస్‌' టోర్నీ రెండో సీజన్‌కు లైన్​ క్లియరైంది. మే నెలాఖరులో టోర్నీ ప్రారంభం కానుందని నిర్వహకులు ప్రకటించారు. నిజానికి ఈ టోర్నీ ఈ నెలలోనే జరగాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడింది. హైదరాబాద్​, విశాఖపట్నం, లఖ్​నవూ, ఇండోర్​ వేదికలుగా మ్యాచ్​లు జరగుతాయని.. జూన్​లో హైదరాబాద్​ వేదికగా ఫైనల్​ జరగనుంది. త్వరలోనే మ్యాచ్​ల పూర్తి షెడ్యూల్​ను విడుదల చేస్తామని నిర్వహకులు స్పష్టం చేశారు.

బాకీలు క్లియర్..

రోడ్​ సేఫ్టీ సిరీస్​ మొదటి సీజన్​లో పాల్గొన్న బంగ్లాదేశ్​ ఆటగాళ్లకు నిర్వహకులు ఇంకా ఫీజు చెల్లించకపోవడంపై ఆటగాళ్లకు అసంతృప్తితో ఉన్నట్లు అక్కడి మీడియా ఇటీవల వెల్లడించింది. అయితే మాజీ ఆటగాడు రజిన్​ సాలేహ్​ విడుదల చేసిన వీడియోతో ఈ సమస్య పరిష్కారమైనట్లు తెలుస్తోంది. నిర్వహకులు తనకు బాకీ ఉన్న ఫీజును చెల్లించారని ఆ వీడియోలో అతడు పేర్కొన్నాడు. అవకాశం వస్తే ఈ టోర్నీలో ఈసారి ఆడేందుకు సిద్ధమని చెప్పుకొచ్చారు.

ఈ సిరీస్​లో భారత్​ సహా ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్​, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​ జట్లు పాల్గొంటాయి.

ఇదీ చూడండి :IPL: 'మహీ విశ్వాసాన్ని రైనా కోల్పోయాడు.. అందుకే అలా'

ABOUT THE AUTHOR

...view details