రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. నమాన్ ఓజా(90*, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(37*, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డంక్(46, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షెన్ వాట్సన్(30, 6 ఫోర్లు), అలెక్స్ డూలన్(35, 5 ఫోర్లు), కామెరూన్ వైట్(30*, ఒక ఫోర్, 2 సిక్స్‌లు)పర్వాలేదనిపించారు. భారత లెజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్(2/25), యూసఫ్ పటాన్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.
నాలుగు బంతులు మిగిలి ఉండగానే.. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నమాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ లెజెండ్స్ బౌలర్లలో షేన్ వాట్సన్ 2 వికెట్లు తీయగా.. జాసన్ క్రేజా, నాథన్ రియర్డన్, మెక్‌గెయిన్ తలో వికెట్ తీసారు. ఓ దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత లెజెండ్స్.. విజయం సాధించడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ విజయాన్ని అందుకున్నారు.