ఇటీవలే దిల్లీ నుంచి దెహ్రాదూన్‌లోని రూర్కీకి వెళ్తుండగా టీమ్‌ఇండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బీసీసీఐ వర్గాల కథనం ప్రకారం.. రిషభ్ పంత్ మోకాలి లిగ్మెంట్‌కు సంబంధించి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిర్వహించినట్లు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అతడు ముంబయిలో ఈ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ! - టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ కార్ యాక్సిడెంట్
టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ముంబయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పంత్ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్‌ను బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడి మోకాలి లిగ్మెంట్‌కు సంబంధించి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలిపాయి.
"రిషభ్ పంత్ మోకాలి లిగ్మెంట్‌కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ టీమ్ విభాగాధిపతి డాక్టర్ పార్దివాలా ఆధ్వర్యంలో పంత్ ఆరోగ్యపరిస్థితిని పరిశీలిస్తోంది" పీటీఐతో బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
దిల్లీ-దెహ్రాదూన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే పంత్‌ను దెహ్రాదూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే నుదిటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబయికి తరలించారు. కుడికాలు లిగ్మెంట్ శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఇతర సమస్యలకు సంబంధించి అవసరమైతే లండన్‌కు పంపించేందుకూ బీసీసీఐ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉంది.