ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు శుభవార్త. వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. డర్హమ్‌లో ఉన్న జట్టు బయో బబుల్‌తో అతడు మంగళవారం కలవనున్నట్లు సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు 3 వారాలు టీమ్ఇండియాకు విశ్రాంతి లభించింది. ఇక లండన్‌లో తిరిగిన పంత్‌కు జులై 8న కరోనా అంటుకుంది. దీంతో అక్కడ ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు పంత్. పది రోజుల క్వారంటైన్ అనంతరం మరోసారి పరీక్షలు నిర్వహించగా వైరస్ లేదని తేలింది.
జులై 20న సెలెక్ట్ కౌంటీ ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది కోహ్లీ సేన. ఈ మ్యాచ్‌కు పంత్ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. రెండో వార్మప్ మ్యాచ్‌లో అతడు పాల్గొంటాడని సమాచారం.
పంత్‌తో పాటు సహాయక సిబ్బంది దయానందకు కూడా కొవిడ్ నిర్ధరణ అయింది. దయానందతో సీనియర్ వికెట్ కీపర్ సాహా సన్నిహితంగా ఉండడం వల్ల అతడు కూడా నిర్బంధంలోకి వెళ్లాడు. దీంతో మొదటి వార్మప్ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.