యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. దీంతో అతడు మాజీ సారథి విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. గతరాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి 211 పరుగుల భారీ స్కోర్ సాధించినా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అంత పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించినా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయింది. వాండర్ డసెన్ (75 నాటౌట్; 46 బంతుల్లో 7x4, 5x6), డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్; 31 బంతుల్లో 4x4, 5x6) చెలరేగడంతో ఆ జట్టు 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. దీంతో పంత్ తొలి టీ20లోనే కెప్టెన్‌గా విఫలమయ్యాడు.
కోహ్లీ తర్వాత పంత్‌కే ఇలా చేదు అనుభవం - రిషబ్ పంత్
తొలిసారి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రిషభ్ పంత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సఫారీల ధాటికి కెప్టెన్‌గా విఫలమయ్యాడు. అయితే ఇదివరకు విరాట్ కోహ్లీకి కూడా ఇదే అనుభవం ఎదురైంది. 2017లో తొలిసారి టీమ్‌ఇండియా టీ20 కెప్టెగాా బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. ఆ మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు.
2017లో విరాట్ కోహ్లీ సైతం ఇలాగే తొలిసారి టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి విఫలమయ్యాడు. కాన్పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అప్పుడు కోహ్లీ 29 పరుగులు సాధించగా.. ఇప్పుడు పంత్ కూడా 29 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే అతడు భారత కెప్టెన్‌గా తొలి టీ20లో విఫలమై కోహ్లీ సరసన నిలిచాడు. అయితే, ఈ సిరీస్‌కు పంత్ అనూహ్యంగా కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మకు విశ్రాంతి నివ్వడంతో తొలుత కేఎల్ రాహుల్‌ను సారథిగా ఎంపిక చేశారు. కానీ, అతడు తొలి మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా తప్పుకోవడంతో రిషభ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు.
ఇదీ చూడండి :తీవ్ర విషాదం.. రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ మృతి