ఐపీఎల్ రెండో దశలో దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషభ్ పంతే ఉండనున్నాడు! గాయం నుంచి కోలుకొని వచ్చిన శ్రేయస్ అయ్యర్‌పై మరీ ఒత్తిడి పెట్టొద్దని దిల్లీ యాజమాన్యం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం శ్రేయస్ దుబాయ్‌లోనే ఉన్నాడు.
ఐపీఎల్‌కు ముందు టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీసులు ఆడింది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. అతడి భుజం ఎముక పక్కకు తొలగడం వల్ల శస్త్రచికిత్స అవసరమైంది. ఫలితంగా ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. బయో బుడగలోకి కరోనా వైరస్ ప్రవేశించిన కారణంగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ లోపు కోలుకున్న శ్రేయస్ రెండో దశకు సిద్ధమయ్యాడు. అతడి రాకతో ఫ్రాంచైజీకి మరో తలనొప్పి ఎదురైంది.