కారు యాక్సిడెంట్ తర్వాత మొదటి సారి నడిచాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేశాడు. ఫొటోలో పంత్.. చేతి కర్ర సాయంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్లుగా కనిపించింది. కుడి కాలికి బ్యాండేజీ కనిపించడం.. కాలు కూడా కొంచెం వాచినట్లుగా ఉంది. దీంతో పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ ఫొటోలకు.. 'ఒక అడుగు ముందుకు, ఒక అడుగు బలంగా, ఒక అడుగు బెటర్‌గా' అంటూ క్యాప్షన్ జోడించాడు పంత్. దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని కూడా పోస్ట్ చేశాడు. అందులో లూడో ఆడుతున్న ఫొటోను జత చేసి 'నేను ఇంత కన్నా ఏం చేయగలను.. ఏమైనా సూచనలు ఇవ్వగలరా' అంటూ రాసుకొచ్చాడు. కాగా, పంత్ పెట్టిన ఈ పోస్టులకు నెటిజన్లతో పాటు ప్రముఖ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రమాదం తర్వాత మొదటిసారి నడిచిన రిషభ్ పంత్.. ఫొటోలు వైరల్! - రిషభ్ పంత్ లేటెస్ట్ ఫొటోస్
కారు యాక్సిడెంట్ తర్వాత మొదటి సారి ఫొటోలను షేర్ చేశాడు టీమ్ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్. అందులో వాకింగ్ స్టిక్‌తో నడుస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లతో సహా సినీ, క్రికెట్ ప్రముఖులు పంత్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

రిషభ్ పంత్ గతేడాది గతేడాది డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దిల్లీ నుంచి లఖ్‌నవూకు వెళ్తున్న సమయంలో రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు శస్త్ర చికిత్సలు నిర్వహించిన తర్వాత.. పంత్ కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇక పంత్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రమాదం కారణంగా.. ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నమెంట్లు సహా ఐపీఎల్ కూడా పంత్ మిస్ అవుతాడు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు కోలుకున్నా.. ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించడం కష్టమే.