ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 78 పరుగులకే ఆలౌటైంది. మన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. టాస్ గెలిచిన కోహ్లీ.. బ్యాటింగ్ తీసుకోవడంపై, ఒకవేళ తీసుకున్నా సరే విఫలం కావడంపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే విరాట్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని అతడికి అండగా నిలిచాడు వికెట్ కీపర్ పంత్. తమ బ్యాటింగ్ లోపాలు, ప్రత్యర్థి బౌలర్లు పిచ్‌ను సద్వినియోగం చేసుకోవడం వల్లే ఆలౌట్ అయ్యామని అన్నాడు.
అలానే సిరాజ్‌పై ఇంగ్లీష్ జట్టు అభిమానులు బాటిల్ విసిరానని పంత్ వెల్లడించాడు. అయితే తనను ఎగతాళి చేస్తూ, అరుస్తున్న వాళ్లకు అదే రీతిలో సమాధానమిస్తూ కనిపించాడు సిరాజ్. ఆ వీడియో కూడా ఇప్పటికే వైరల్‌గా మారింది.
క్రీజులో తన స్టాన్స్ కూడా మార్చుకున్నానని పంత్ చెప్పాడు. అంపైర్ చెప్పడం వల్ల ఈ మార్పు జరిగిందని పేర్కొన్నాడు. క్రీజు బయట నిలబడం వల్ల డేంజర్ ఏరియాలో తన పాదముద్రలు పడుతున్నాయని, అందువల్లే నిల్చునే ప్రదేశం మారిందని అన్నాడు.