Rinku Singh Kaun Banega Crorepati :టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రింకు సింగ్.. తాజాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే అతడికి తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టేసిన రింకు ఐర్లాండ్‌తో సిరీస్‌తోపాటు ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో ఓ ప్రశ్న రూపంలో రింకు సింగ్ వచ్చేశాడు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో 'ఘూమర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ కేబీసీలో పాల్గొంది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్‌తోపాటు డైరెక్టర్ ఈ షోలో పాల్గొన్నారు.
Rinku Singh 5 Sixes Match : 'ఘూమర్' చిత్ర యూనిట్‌కు హోస్ట్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు కరెక్ట్‌గా సమాధానం చెబితే రూ. 6.40లక్షలను గెలుచుకొనే అవకాశం ఉంటుంది. 'ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చెందిన ఏ ఆటగాడు వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టాడు?' అనే ప్రశ్నకు ఆండ్రూ రస్సెల్, నితీశ్ రాణా, రింకు సింగ్, వెంకటేశ్ అయ్యర్.. నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుందిగా.. ఆ బ్యాటర్ రింకు సింగ్ అని. 2023 ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్స్‌లు బాది కోల్‌కతాను గెలిపించాడు రింకు సింగ్. మరి ఆ చిత్ర యూనిట్ సమాధానం కరెక్టుగా చెప్పిందో లేదో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకూ వేచి చూడాల్సిందే.