తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 8:00 PM IST

ETV Bharat / sports

Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా యోగా సెంటర్లు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International YOGA Day) పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 25 'ఫిట్​ ఇండియా యోగా సెంటర్ల'ను గుర్తించినట్లు కేంద్ర ఆయూష్ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. నిత్యం యోగాసనాలు వేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇమ్యూనిటీ మెరుగవుతుందని పేర్కొన్నారు.

kiren rijju, union ayush minister
కిరెన్ రిజిజు, కేంద్ర ఆయూష్ మంత్రి

జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International YOGA Day) పురస్కరించుకుని.. దేశంలోని 9 రాష్ట్రాలలో 25 ఫిట్​ ఇండియా యోగా సెంటర్లను (Fit India Yoga Centers) ప్రారంభించింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆయూష్ శాఖ​ మంత్రి కిరెన్​ రిజిజు వెల్లడించారు.

"మన ప్రాచీన వారసత్వంలో భాగమైన యోగా.. ప్రస్తుత కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా. నిత్యం యోగాసనాలు వేస్తే శారీరక, మానసిక ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఈ కొత్త యోగా కేంద్రాల ద్వారా మరింత మందికి యోగా ప్రాముఖ్యత తెలుస్తుంది."

-కిరెన్ రిజిజు, కేంద్ర ఆయూష్ మంత్రి.

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో మొత్తం 25 ఫిట్ ఇండియా యోగా కేంద్రాలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. జూన్​ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా వీటన్నింటికి ఫిట్​ ఇండియా సర్టిఫికెట్లను అందజేయనున్నారు.

వీటిలో అత్యధికంగా ఉత్తర్​ ప్రదేశ్​లో 5 కేంద్రాలను గుర్తించగా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు 4 చొప్పున సెంటర్లను కేటాయించారు. మధ్యప్రదేశ్​లో 3, తమిళనాడులో 2, ఉత్తరాఖండ్, పంజాబ్, దిల్లీకి ఒకటి చొప్పున ఫిట్​ ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:Olympics: 'అథ్లెట్​ ఇంజూరీ మేనేజ్​మెంట్​ సిస్టమ్​' ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details