తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ లాంటి ఆటగాడు మాకు లేడు: పాంటింగ్‌ - Ricky Ponting Wants a Dhoni in Australia

టీమ్​ఇండియా మాజీ సారథి ధోనీ ప్రశంసించిన ఆసీస్​ మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్​.. మహీ లాంటి గొప్ప ఫినిషర్​ తమ జట్టులో లేడని అన్నాడు. తమ టీమ్​లో అలాంటి ఆటగాడు ఎందుకు లేడో కారణాన్ని వివరించాడు.

yash
పాంటింగ్‌

By

Published : May 30, 2021, 8:11 AM IST

ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా సరే ధోనీ(MS Dhoni) లాంటి మేటి ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌(Ricky ponting) అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం కంగారు జట్టు ఎప్పుడూ ఆలోచించేదని చెప్పాడు. ఫినిషర్‌ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అన్నాడు.

"ధోనీ కెరీర్‌ సాగినంత కాలం ఫినిషర్​గానే ఆడాడు. ఆ స్థానంలో తనదైన ముద్ర వేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హార్దిక్‌ పాండ్య(Hardik pandya), కీరన్‌ పొలార్డ్‌(Pollard) కూడా అలాంటి ఆటగాళ్లే. తమ దేశాలకు, లేదా ఐపీఎల్‌ జట్లకు నిలకడగా విజయాలు అందిస్తారు. వాళ్లిద్దరూ ఆయా స్థానాలకు పరిమితమయ్యారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో సరైన ఫినిషర్‌ లేకపోడానికి ప్రధాన కారణం.. అందులో బాగా ఆడే ఆటగాళ్లంతా బిగ్‌బాష్‌ లీగ్‌లో టాప్‌లోనే ఆడతారు."

-పాంటింగ్‌, ఆసీస్​ మాజీ సారథి

ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్‌ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ లేరని, అలాంటి ఆటగాడి కోసమే వెతకాల్సి ఉందని మాజీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌, మార్కస్‌ స్టోయినిస్‌లను మ్యాచ్‌ ఫినిషర్లుగా పరిగణించాల్సి ఉందా? అని పాంటింగ్‌ ఎదురు ప్రశ్నించాడు. ఆ ముగ్గురూ బిగ్‌బాష్‌లో(BigBash) టాప్‌ఆర్డర్‌లో ఆడతారని, వారిని లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయమని ఆయా జట్లను కోరడం కష్టమని తెలిపాడు.

ఐపీఎల్‌లో దిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్న పాంటింగ్‌.. స్టోయినిస్‌ను మ్యాచ్‌ ఫినిషర్‌గా చూడాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అతడు పలు విజయాలు సాధించాడని గుర్తుచేశాడు. లోయర్‌ ఆర్డర్‌లో అలా ఆడిస్తేనే మంచి ఫినిషర్లుగా తయారవుతారని, కానీ.. వారిని ఇలా ఆడించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తనకు తెలియదని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: పసిడికి అడుగు దూరంలో భారత బాక్సర్లు

ABOUT THE AUTHOR

...view details