భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని చేపట్టడానికి రాహుల్ ద్రవిడ్(rahul dravid head coach) అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(ricky ponting news) అన్నాడు. "భారత క్రికెట్ జట్టు కోచ్ పదవిని రాహుల్ ద్రవిడ్ అంగీకరించడం ఆశ్చర్యానికి గురి చేసింది. భారత అండర్-19 కోచ్‌గా అతడెంత ఆనందంగా ఉండేవాడో నాకు తెలుసు. అతడి కుటుంబం గురించి తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారని అనుకుంటున్నా. అయినా అతడు కోచ్ పదవి చేపట్టడం ఆశ్చర్యం కలిగించింది. తమకు సరైన వ్యక్తి దొరికాడని కొందరు చెప్పడాన్ని బట్టి.. పదవి చేపట్టేలా వారు ద్రవిడ్‌ను ఒప్పించి ఉండొచ్చు" అని రికీ తెలిపాడు.
టీమ్‌ఇండియా చీఫ్ కోచ్‌గా ఉండాలని తనను సంప్రదించారని కానీ తాను అంగీకరించలేదని పాంటింగ్ తెలిపాడు. "టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ ప్రతిపాదనతో నా వద్దకు కొందరు వచ్చారు. ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నించారు. అంత సమయం కేటాయించలేనని వారితో చెప్పాను" అని పాంటింగ్ అన్నాడు. దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రికీ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.