తెలంగాణ

telangana

ETV Bharat / sports

Richa Ghosh Birthday : బర్త్​డేకు రెండ్రోజుల ముందే 'గోల్డ్ మెడల్'.. 8 ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో కలిసి గ్రాండ్ పార్టీ​!

Richa Ghosh Birthday : ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్​లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం సాధించిన తుది జట్టులోని సభ్యురాలైన​ రిచా ఘోష్​ మరో రెండు రోజుల్లో(సెప్టెంబర్​ 28) పుట్టినరోజు జరుపుకోనుంది. అయితే ఈమె చాలా ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి బర్త్​డేను సెలబ్రేట్​ చేసుకోబోతుండటం విశేషం. ఈ సందర్భంగా ఆమె తండ్రి ఈటీవీ భారత్​తో స్పెషల్​ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం..

Asian Games Gold Medalist Richa To Spend Birthday At Home After Long Time
Richa Ghosh Birthday With Family After Long Time

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 7:09 PM IST

Updated : Sep 26, 2023, 7:23 PM IST

Richa Ghosh Birthday : చైనా హాంగ్​జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భాగంగా భారత మహిళా క్రికెట్​ జట్టు... లంకేయులపై తుది పోరులో 19 పరుగుల తేడాతో విజయ సాధించి చరిత్ర సృష్టించింది. క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి జట్టుగా ​ నిలిచింది. దీంతో టీమ్​ఇండియా అమ్మాయిల జట్టుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

చాలా ఏళ్ల తర్వాత!..అయితేఈ విజయం సాధించిన ​ఫైనల్​ జట్టులో సభ్యురాలైన టీమ్​ఇండియా ప్లేయర్​ రిచా ఘోష్​ సెప్టెంబర్​ 28న(గురువారం) తన 20వ ఏటలోకి అడుగుపెట్టబోతుంది. ఈమె బంగాల్​.. డార్జిలింగ్​ జిల్లాలోని సిలిగురి పట్టణానికి చెందిన అమ్మాయి. అయితే ఈమె దాదాపు 7, 8 సంవత్సరాల తర్వాత తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోబోతుండటం విశేషం. ఇందుకు సంబంధించి రిచా కుటుంబ సభ్యులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో మరో బంగాల్​ క్రికెటర్​ టిటాస్ సాధు కూడా సందడి చేయనుంది.

ఎంతో గర్వాంగా ఉంది..దేశానికి బంగారు పతకాన్ని సాధించిన జట్టులో తమ అమ్మాయి ఉండటం తమకు ఎంతో గర్వంగా ఉందని రిచా ఘోష్​ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. సెప్టెంబర్​ 27న బుధవారం రిచా సిలిగురికి చేరుకుంటుందని ఆయన తెలిపారు. రిచా.. గత 7-8 సంవత్సరాల నుంచి తన పుట్టినరోజు నాడు ఏదో ఓ టోర్నమెంట్ల కోసం వివిధ ప్రాంతాల్లో ఉంటోందని చెప్పారు. ఇన్నాళ్ల తర్వాత ఆమె తమతో కలిసి బర్త్​డే సెలబ్రేట్​ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఈ వేడుకను నిర్వహించి ఆమెకు సర్​ప్రైజ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రిచాకు ఎంతో ఇష్టమైన పలు రకాల వంటకాలను.. ఆమె తల్లి వండి తినిపించబోతున్నట్లు చెప్పారు.

"ఆదివారం రాత్రి రిచాతో నేను ఫోన్​లో మాట్లాడాను. కానీ క్రికెట్​ గురించి ఏమి మాట్లాడుకోలేదు. ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నాము. చివరగా సోమవారం జరగబోయే మ్యాచ్​కు తనకు విషెస్​ చెప్పాను. ఇతర టోర్నమెంట్లలో నెగ్గిన విజయాల కన్నా ఈ ఆసియా క్రీడల్లో విజయం అనేది రిచాకు ఓ బిగ్​ అచీవ్​మెంట్​. అసియా క్రీడల్లో గెలవాలన్నది ప్రతిఒక్కరి కల. దానిని నా కూతురు నెరవేర్చుకుంది. అందుకు గర్వంగా ఫీల్​ అవుతున్నాను. ఇతర ప్లేయర్లు కూడా అద్భుతంగా ఆడారు. ఇక సెప్టెంబర్​ 27న తను సిలిగురికి చేరుకుంటుంది."

- మన్​బేంద్రా ఘోష్​, రిచా ఘోష్​ తండ్రి

రిచా ఘోష్
Last Updated : Sep 26, 2023, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details