తెలంగాణ

telangana

ETV Bharat / sports

MS Dhoni: 'జెర్సీ నెం.7కు వీడ్కోలు పలకాలి' - బీసీసీఐ

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జెర్సీకి వీడ్కోలు పలకాలని అన్నారు మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్‌. అదే ధోనీకి ఇచ్చే గౌరవమని తెలిపారు.

MS Dhoni jersey
ఎంఎస్ ధోనీ

By

Published : Jul 9, 2021, 2:37 PM IST

Updated : Jul 9, 2021, 3:19 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ ధరించిన జెర్సీ-7కు వీడ్కోలు పలకాలని మాజీ క్రికెటర్ సాబా కరీమ్‌ అంటున్నారు. మరికొంత మంది దిగ్గజాలనూ అలాగే గౌరవించాలని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ మహీ.. యువకులకు మార్గనిర్దేశం చేయగలడని పేర్కొన్నారు.

"ధోనీ జెర్సీ మాత్రమే కాదు మరికొందరు భారత దిగ్గజాల జెర్సీలనూ బీసీసీఐ భద్రపరచాలి. వారు ధరించిన జెర్సీ నంబర్లను ఇతరులు వాడకుండా చూడాలి. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లిన దిగ్గజాలకు ఇదో గుర్తింపు. వారిని ఇలా గౌరవించొచ్చు"

-సాబా కరీమ్‌, మాజీ క్రికెటర్

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడనప్పటికీ భారత కుర్రాళ్లకు అతడు దారిచూపే దీపం కాగలడని కరీమ్‌ అభిప్రాయపడ్డారు. 'అతడు భారత క్రికెట్‌కు సేవలు కొనసాగిస్తాడనే అనుకుంటున్నా. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున అతడెంతో మంది యువకులను తీర్చిదిద్దాడు. రాష్ట్ర స్థాయిలోనూ కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేయాలి. అలాగైతే భారత క్రికెట్‌ భవిష్యత్తుకు మంచి జరుగుతుంది' అని సాబా కరీమ్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:MS Dhoni: అత్యుత్తమ సారథి.. రికార్డులకు 'వారధి' ధోనీ

Last Updated : Jul 9, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details