India New Test Captain: టీమ్ఇండియా వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మనే.. పూర్తిస్థాయి టెస్టు సారథి బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఇప్పటికే అతడి పేరు ఖరారు చేసిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
2 టెస్టులు, 3 టీ-20ల సిరీస్ కోసం శ్రీలంక.. భారత్కు రానుంది. ఫిబ్రవరి 24న టీ-20లతో పర్యటన ప్రారంభం కానుంది. లంకతో టెస్టు సిరీస్ కంటే ముందే.. ఛేతన్ శర్మ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ కెప్టెన్గా రోహిత్ పేరును ప్రకటించనుందని తెలుస్తోంది.
ఇటీవల సౌతాఫ్రికా చేతిలో 1-2 తేడాతో టీమ్ఇండియా టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. సారథిగా వైదొలిగాడు విరాట్ కోహ్లీ. అప్పటినుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. వన్డే, టీ20 కెప్టెన్గా ఉన్న రోహితే.. టెస్టు కెప్టెన్ అవుతాడని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. మధ్యలో పంత్, బుమ్రా, కేఎల్ రాహుల్ పేర్లు కూడా వినిపించాయి. కానీ.. సెలక్టర్లు రోహిత్ వైపే మొగ్గినట్లు క్రికెట్ పండితులు చెబుతున్నారు.
శ్రీలంకతో షెడ్యూల్ ఇది..
ఫిబ్రవరి 24- తొలి టీ-20 (లఖ్నవూ)