తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021 Schedule: ఐపీఎల్​ షెడ్యూల్​కు మార్పులు తప్పవా! - ఐపీఎల్ తేదీల మార్పు ఆలోచనలో బీసీసీఐ

టీ20 ప్రపంచకప్​కు సంబంధించి ఐసీసీ తేదీలను ప్రకటించిన నేపథ్యంలో.. ఐపీఎల్​ షెడ్యూల్​లోనూ(IPL 2021 schedule)​ మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు మధ్య కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే ఉండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ipl, icc, bcci
ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ

By

Published : Jun 29, 2021, 9:18 PM IST

ఐపీఎల్ రెండో దశ​షెడ్యూల్(IPL 2021 schedule)​లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ప్రపంచకప్​ తేదీలకు(T20 worldcup schedule), ఐపీఎల్​కు మధ్య రెండ్రోజుల సమయం మాత్రమే ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. లీగ్ 14వ సీజన్​ ఫైనల్​ను అక్టోబర్​ 10న నిర్వహించాలని.. తద్వారా ప్రపంచకప్​కు ముందు ఆటగాళ్లకు వారం రోజుల విశ్రాంతైనా లభిస్తుందనేది బోర్డు ఆలోచన.

టీ20 ప్రపంచకప్​ను అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 14 వరకు యూఏఈతో పాటు ఒమన్​ వేదికగా నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, ఐపీఎల్​ను అంతకుముందే.. అదే యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19 నుంచి అక్టోబర్​ 15 వరకు నిర్వహించాలని బీసీసీఐ భావించింది. ఈ రెండు టోర్నీల మధ్య రెండ్రోజుల సమయం మాత్రమే ఉండడం వల్ల ఐపీఎల్​ను వారం రోజులు ముందుకు జరపాలని బోర్డు భావిస్తోంది. అక్టోబర్​ 24 నుంచి ప్రధాన జట్లు పొట్టి కప్​లో పాల్గొనాల్సి ఉండగా.. 17 నుంచి చిన్న దేశాలు క్వాలిఫైయర్స్​ మ్యాచ్​లు ఆడతాయి.

కొవిడ్ కారణంగా భారత్​లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్​ను యూఏఈకి తరలించింది ఐసీసీ. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది. టోర్నీ నిర్వహణ నాటికి దేశంలో కరోనా పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేమని కూడా ఐసీసీకి విన్నవించుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్​కు సంబంధించి షెడ్యూల్​తో పాటు వేదికను ప్రకటించింది ఐసీసీ.

ఇదీ చదవండి:టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ ఇదే.. ఆ హక్కులు భారత్​వే!

ABOUT THE AUTHOR

...view details