Red Card In Cricket : ఫుట్‌బాల్, హాకీ లాంటి ఆటల్లో రెడ్, యెల్లో కార్డ్ అనే పదాలు వినిపిస్తాయి. సాధారణంగా ప్లేయర్లు గ్రౌండ్లో అతిగా ప్రవర్తించినప్పుడు సదరు ఆటగాడికి అంపైర్లు ఈ కార్డులను జారీ చేస్తారు. యెల్లో కార్డ్ జారీ చేస్తే.. ఆటగాడు తాత్కాలికంగా 5 నిమిషాల పాటు మైదానాన్ని వీడాలి. అదే రెడ్ కార్డు ఇష్యూ అయితే.. ప్లేయర్‌పై పూర్తిగా ఆట నుంచి నిషేధం విధిస్తారు. కానీ ఈ నిబంధన ప్రస్తుతానికి అంతర్జాతీయ క్రికెట్లో లేదు. అయితే వెస్టిండీస్‌లో జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి క్రికెటర్ ఎవరంటే..
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో నరైన్.. రెడ్‌కార్డ్ నిబంధన వల్ల గ్రౌండ్‌ను వీడాడు. సీపీఎల్ నిబంధనల ప్రకారం ఏ జట్టైనా.. నిర్ణిత సమయంలోపు 18 ఓవర్‌ను ప్రారంభించకపోతే.. ఆ ఓవర్లో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉండాలి.