టీమ్ఇండియా కోచింగ్ సిబ్బందిలో ఐదుగురికి కరోనా సోకింది. దీంతో ఇంగ్లాండ్‌తో శుక్రవారం జరగాల్సిన ఐదో టెస్టు రద్దయింది. ఇరుబోర్డుల చర్చించి, ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయంలో తప్పెవరిది?
జర్వో కారణమా?
భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లను బయో బబుల్ ఉంచి, ఈ టెస్టులు నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ప్రాంక్‌స్టార్ డేనియల్ జర్వో(jarvo 69).. వేర్వేరు సందర్భాల్లో మూడుసార్లు మైదానంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఒక్కసారి అయితే పర్వాలేదు కానీ అన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి ఎలా వచ్చాడు? ఈ పనుల వల్లే హెడింగ్లే మైదానంలో అతడిపై జీవితకాల నిషేధం విధించారు. ఓవల్ గ్రౌండ్లోకి దూసుకొచ్చినందుకు ఏకంగా జర్వోను అరెస్టు చేశారు.
అలానే ఈ టెస్టులకు 100 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించారు. వాళ్లలో ఎవరూ మాస్కులు పెట్టుకోలేదు. ఇది కూడా టీమ్ఇండియాలో కొవిడ్ కేసులు రావడానికి కారణమని అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.