తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2022, 7:05 AM IST

Updated : Apr 24, 2022, 7:57 AM IST

ETV Bharat / sports

ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీకి ఇది రెండోసారి

IPL 2022 RCB VS Sunrisers Hyderabad: ఐపీఎల్​లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీని 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది సన్​రైజర్స్​. తొలి రెండు మ్యాచ్​ల్లో ఓడిన ఎస్​ఆర్​హెచ్​.. తర్వాతి 5 మ్యాచ్​లు వరుసగా గెలవడం విశేషం. మరోవైపు ఈ మ్యాచ్​లో ఆర్సీబీ సాధించిన స్కోరు (68). ఐపీఎల్​ చరిత్రలోనే బెంగళూరుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం..

IPL 2022 RCB
IPL 2022 RCB

IPL 2022 RCB VS Sunrisers Hyderabad: బెంగళూరును చిత్తు చేస్తూ హైదరాబాద్‌ మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు కేవలం 68 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం హైదరాబాద్‌ 8 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 72 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కేన్ విలియమ్సన్, డుప్లెసిస్‌ మాట్లాడారు.

కేన్‌ విలియమ్సన్‌ : మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మంచి ప్రదర్శన ఇచ్చాం. అయితే వచ్చే మ్యాచ్‌పైనే మా దృష్టి నిలుపుతాం. ఎందుకంటే ప్రతి మ్యాచూ కీలకమైందే. పిచ్‌ మీద బంతి బాగా స్వింగ్‌ అవుతోంది. అందువల్లే పవర్‌ప్లేలో వికెట్లను తీసుకోగలిగాం. జాన్‌సెన్‌ దృష్టింతా బౌలింగ్‌పైనే ఉంటుంది. అలానే ఓపెనర్‌ అభిషేక్ టైమింగ్‌ చక్కగా ఉంది. అయితే మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదురువుతాయి. వాటిని అడ్డుకోవడంపైనే ఆలోచిస్తాం.

డుప్లెసిస్‌:తొలి నాలుగు ఓవర్లలో మేం వికెట్లను కోల్పోకుండా ఉండాల్సింది. ఇదే వారిని ముందడుగు వేసేలా చేసింది. వచ్చే మ్యాచుల్లోనైనా ఇలాంటి పరిస్థితి రాకుండా మార్గం అన్వేషించాలి. పవర్‌ప్లేలో కొన్ని పరుగులు చేయకపోయినా వికెట్లను కోల్పోకుండా ఉండాలి. బంతి స్వింగ్‌, సీమ్‌ అవుతుంటే మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకుంటే మాత్రం సులువుగా పరుగులు రాబట్టొచ్చు. పిచ్‌ కూడా బౌలింగ్‌కు బాగా సహకరించింది. జాన్‌సెన్‌ చాలా బాగా బౌలింగ్‌ చేశాడు. వికెట్‌కు ఇరువైపులా స్వింగ్‌ రాబట్టాడు. ఇది మాకు దుర్దినం. ఎక్కువగా ఆలోచించకుండా తదుపరి మ్యాచ్‌పై ఫోకస్‌ చేస్తాం.

మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు..

  • బెంగళూరుకు ఇది రెండో అత్యల్ప స్కోరు (68). ఇంతకుముందు కోల్‌కతాపై 49 పరుగులకే ఆలౌట్
  • బంతులపరంగా హైదరాబాద్‌ది నాలుగో విజయం (72 బంతులు మిగిలి ఉండగానే), ముంబయి (87 బంతులు), కోచి (76 బంతులు), పంజాబ్ (73 బంతులు) ఘన విజయాలు నమోదు చేశాయి
  • ఎనిమిది సార్లు: బెంగళూరు వంద కంటే తక్కువ స్కోర్లు నమోదు చేయడం
  • టీ20 లీగ్‌లో ఇది ఆరో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు బెంగళూరే (49) పేరిటే ఉంది
  • వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ గోల్డెన్‌ డక్‌.. మొదటి బంతికే ఔటై పెవిలియన్‌కు చేరాడు
  • హైదరాబాద్‌కిది వరుసగా ఐదో విజయం. లీగ్‌ ప్రారంభంలో రెండు మ్యాచ్‌లు ఓడి పుంజుకోవడం విశేషం

ఇదీ చూడండి: ఆర్​సీబీని చిత్తుచేసిన సన్​రైజర్స్​.. లీగ్​లో వరుసగా ఐదో విజయం

Last Updated : Apr 24, 2022, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details