తెలంగాణ

telangana

ETV Bharat / sports

మ్యాచ్​కు ముందే ఆర్సీబీకి షాక్​.. గాయం కారణంగా విల్​ జాక్స్ దూరం! - ఆర్సీబీ టీమ్​ విల్​ జాక్స్

ఐపీఎల్​ సీజన్​ మొదలు కాకుండానే ఆర్సీబీ టీమ్​కు గట్టి షాక్ తగిలింది. ఇటీవలే జట్టులోకి చేరిన ఇంగ్లాండ్​ ప్లేయర్​ విల్​ జాక్స్​.. గాయం కారణంగా దూరమయ్యాడు.

england player will jacks
rcb player will jacks

By

Published : Mar 16, 2023, 2:07 PM IST

Updated : Mar 16, 2023, 2:42 PM IST

ఐపీఎల్ మొదలవ్వకముందే రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 మ్యాచ్​లకు ఇంగ్లాండ్ యంగ్ ప్లేయర్ విల్ జాక్స్ దూరం కానున్నాడు. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్​ 2న ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. అయితే.. గాయం కారణంగా జాక్స్ ఈ మ్యాచ్​కు రాలేకపోతున్నాడు.

మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇటీవలే జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విల్ జాక్స్‌ గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. స్కానింగ్ రిపోర్ట్స్​లో గాయం తీవ్రత ఎక్కువ అయినట్లు స్పష్టమైంది. దీంతో డాక్టర్ల సూచన మేరకు చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు విల్​. అయితే అతడి గాయం కారణంగా ఇప్పుడు ఐపీఎల్​కు దూరమయ్యాడు. కాగా ఇప్పటి వరకు ఈ ఇంగ్లాండ్​ ప్లేయర్​ ఒక్కసారి కూడా ఐపీఎల్‌లో ఆడలేదు. అయితే వివిధ దేశాల్లో జరిగిన టీ20 లీగుల్లో మాత్రం ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇక ఇతని ఆటకు స్టేడియం మొత్తం దద్దరిల్లిందనే చెప్పాలి. బంతిని స్టేడియంలో దాటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ యంగ్​ ప్లేయర్​.

ఇంగ్లాండ్‌కు చెందిన ఈ 24 ఏళ్ల ప్లేయర్​ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పవర్ హిట్టింగ్ స్కిల్స్, ఆఫ్ స్పిన్ టాలెంట్​తో అందరిని మెస్మరైజ్​ చేసిన ఈ ప్లేయర్​ను ఐపీఎల్ 2023 వేలంలో రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్సీబీ ఫ్రాంచైజీ. అయితే ఇప్పుడు విల్​ స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైకేల్ బ్రాస్‌వెల్‌ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది న్యూజిలాండ్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రాస్‌వెల్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో కివిస్​ జట్టు తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఇతను 16 టీ20లు ఆడగా అందులో 21 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ కేవలం 113 పరుగులే స్కోర్​ చేశాడు.

ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అవినాశ్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్ , వానిందు హసరంగా, మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోను యాదవ్.

Last Updated : Mar 16, 2023, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details