Ravishastri test cricket: టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ప్రస్తుత విధానం ప్రకారం పదేసి జట్లతో మ్యాచ్‌లను ఆడించకూడదని పేర్కొన్నాడు. కేవలం ఆరు టీమ్‌లతో మాత్రమే టెస్టులు ఆడించాలని తెలిపాడు. "టెస్టు క్రికెట్‌ను విస్తృతపరించేందుకు ఇప్పుడున్న ప్రకారం పది జట్లతో కాకుండా.. ఆరు జట్లతోనే క్వాలిటీ టెస్టు క్రికెట్‌ను ఆడించాలి. మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటం కాదు.. నాణ్యమైన ఆటను ప్రేక్షకులకు అందించాలి. టాప్-6లో ఉండే టీమ్ ఆ గ్రూప్‌లోని మిగతా జట్లతో టెస్టు క్రికెట్ ఆడుతుంది. గ్రూప్‌లో లేకపోతే ఆడే పరిస్థితే ఉండదు. అది భారత్, ఆసీస్, ఇంగ్లాండ్ .. ఇలా ఏజట్టైనా సరే టాప్-6లో ఉండాల్సిందే. అప్పుడు నాణ్యమైన క్రికెట్ అందించినట్లు అవుతుంది" అని రవిశాస్త్రి వివరించాడు. టెస్టు క్రికెట్ అంటేనే నాణ్యతకు మారుపేరని పేర్కొన్నాడు.
అలా చేస్తేనే టెస్టుకు ఆదరణ పెరుగుతుంది: రవిశాస్త్రి - రవిశాస్త్రి టెస్టు క్రికెట్
Ravishastri test cricket: టెస్టు క్రికెట్‌కు మరింత ఆదరణ తెచ్చేందుకు టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. అవేంటంటే...
తెల్లబంతి క్రికెట్‌ను విస్తరించడానికీ చాలా అవకాశాలు ఉన్నాయని రవిశాస్త్రి తెలిపాడు. టెస్టులను తక్కువ జట్లతో నిర్వహించి.. టీ20, వన్డే క్రికెట్‌ను అన్ని టీమ్‌లతో ఆడించాలని సూచించాడు. "క్రికెట్‌ను అన్ని దేశాలకు తీసుకెళ్లాలంటే టీ20, వన్డే ఫార్మాట్‌ను విస్తరించాలి. అందుకోసం ఎక్కువ జట్లతో మ్యాచ్‌లు నిర్వహించవచ్చు. మరీ ముఖ్యంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగిపోయింది. ఫుట్‌బాల్ తరహాలో ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా టీ20 ప్రపంచకప్ ఎలానూ ఉంటుంది" అని తెలిపాడు.
ఇదీచూడండి: దిగ్గజాలకే చెమటలు పట్టించిన బౌలర్.. కానీ ఇప్పుడు..