తెలంగాణ

telangana

IND VS AUS : ఏంది రోహిత్.. ఆ​ ఎక్స్​ప్రెషన్​!

By

Published : Mar 2, 2023, 9:35 AM IST

Updated : Mar 2, 2023, 9:52 AM IST

బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఆసీస్​తో జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో కెప్టెన్​ రోహిత్​ శర్మ ఇచ్చిన ఎక్స్​ప్రెషన్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఆ వీడియో మీకోసం...

ROHIT SHARMA REACTION
ROHIT SHARMA REACTION

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా ఇందోర్​ వేదిగా భారత్​-ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు జరుగుతోంది. వరుసగా రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న టీమ్ఇండియా..​ మూడో టెస్టులో మాత్రం తడబడుతూ ఆడుతోంది. మొదటి రోజు టాస్​ గెలచి బ్యాటింగ్​కు దిగిన భారత్​.. తొలి ఇన్నింగ్స్​లో 33.2 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పుకూలింది. ఓపెనర్లు రోహిత్​, గిల్​ మంచి స్టార్ట్​ను అందించారు. కాగా, ఆసీస్​ స్పిన్​ ద్వయం కునెమన్​, లయోన్​ టీమ్​ఇండియా బ్యాటర్లకు చెమటలు పట్టించారు. కేవలం 18 పరుగులు సమర్పించి ఐదు వికెట్లు పడగొట్టారు. మొదట రోహిత్​ శర్మను ఔట్​ చేశారు. ఆ తర్వాత గిల్, పుజారా, శ్రేయస్​, జడేజా వరుసగా పెవీలియన్​ బాట పట్టారు. అయితే జడేజా ఔట్​ అయిన తీరు అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.

బ్యాటింగ్​ ఆర్డర్​లో ముందుకు మారిన తర్వాత జడేజా తన మ్యాజిక్​ చూపించలేకపోయాడు. లయోన్​ వేసిన 11వ ఓవర్లో బంతి జడేజా ప్యాడ్​కు తగిలింది. దీంతో లయోన్​ ఎల్​బీడబ్ల్యూ అప్పీల్​ చేశాడు. దీంతో ఫీల్డ్​ అంపైర్​ ఔట్​ ప్రకటించాడు. అనంతరం జడేజా డీఆర్​ఎస్​ రివ్యూ తీసుకున్నాడు.బంతి బ్యాట్​కు తాకినట్లు అల్ట్రా ఎడ్జ్ చూపించింది. దీంతో టీమ్ఇండియా ఊపిరిపీల్చుకుంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ వెంటనే లయోన్​ వేసిన బంతిని జడేజా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంటి నేరుగా ఫీల్డర్​ కునెమన్​ చేతిలోకి వెళ్లింది. దీంతో జడ్డూ కేవలం నాలుగు పరుగులకే పెవీలియన్​ చేరాడు. కాగా, జడేజా ఔట్ అయినప్పుడు రోహిత్​ శర్మ, నాన్​స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న విరాట్​ కోహ్లీ డిసప్పాయింట్​ అయ్యారు. అప్పుడు వారు ఇచ్చిన ఎక్స్​ప్రెషన్స్.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

కాగా, తొలి ఇన్నింగ్స్​లో 109 పరుగులకు ఆలౌట్ అయింది టీమ్ఇండియా. కోహ్లీ(22) కొద్దిగా ఫర్వాలేదనిపించినా... మిగతా వారంతా పేలవ ప్రదర్శన చేశారు. ఇక కంగారూ బౌలర్లలో 5 వికెట్లు పడగొట్టి కునెమన్​ అద్భుత ప్రదర్శన చేశాడు. లయోన్​ 3 వికెట్లతో రాణించగా.. టాట్​ మర్ఫీ 1 వికెట్​ తీశాడు.

Last Updated : Mar 2, 2023, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details