తెలంగాణ

telangana

ETV Bharat / sports

wtc final: రెట్రో లుక్​ జెర్సీతో టీమ్ఇండియా - team india new retro jersy

జూన్​ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC final) కొత్త జెర్సీ ధరించి ఆడనుంది టీమ్​ఇండియా. ఇది 1980లో భారత జట్టు ధరించిన జెర్సీని(Retro Jersy) పోలి ఉంది. దీన్ని స్టార్​ ఆల్​రౌండర్​ జడేజా పోస్ట్ చేశాడు.

WTC Final:
1980 జెర్సీ లుక్​

By

Published : May 29, 2021, 2:19 PM IST

Updated : May 29, 2021, 2:39 PM IST

త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో (wtc final) కొత్త జెర్సీతో బరిలో దిగనుంది టీమ్​ఇండియా. ఇది 1980వ కాలం నాటి భారత జట్టు ధరించిన జెర్సీ(Retro Jersy) లుక్​ను పోలి ఉంది. దీనిమీద ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్స్ 2021 అని రాసి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆల్​రౌండర్​ జడేజా పోస్ట్​ చేశాడు. 'రివైండ్​ టు 1980' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు.

ఇంగ్లాండ్​లోని సౌథాంప్టన్​ వేదికగా జూన్​18-22వరకు కివీస్​తో టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడనుంది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిస్తే, ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని తెలిపింది ఐసీసీ.

ఇదీ చూడండి అశ్విన్​​ ఫస్ట్​బెంచ్​​ స్టూడెంట్:​ జాఫర్

Last Updated : May 29, 2021, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details