ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 2000 పరుగులు చేసి, 200 వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.
తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 56పరుగులు చేశాడు జడేజా. ఫలితంగా టెస్టుల్లో 2వేల మైలురాయిని అందుకున్నాడు. ఇలా 2వేల పరుగులతో పాటు 200 వికెట్లు తీసిన భారత క్రికెటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. కపిల్ దేవ్, అశ్విన్, అనిల్ కుంబ్లే, హర్భజన్.. జడేజా ముందు ఉన్నారు. మొత్తం మీద 21వ ఆటగాడు జడేజా.