ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన భారత టెస్టు జెర్సీని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రయోజనం కోసం ఆ జెర్సీని ఇచ్చినట్లు సంకేతాలిస్తూ.. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జడ్డూకు ధన్యవాదాలు తెలిపాడు వాన్. దీనికి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన వాన్.. 'జెర్సీ ద్వారా ఛారిటీకి డబ్బును సమకూరుస్తా' అని పేర్కొన్నాడు.
వాన్‌కు జడేజా జెర్సీ గిఫ్ట్.. ఎందుకంటే? - మైకేల్ వాన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్‌కు తన టెస్టు జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. ఎప్పుడూ టీమ్ఇండియాపై వ్యంగాస్త్రాలు సంధించే వాన్‌కు జడేజా జెర్సీని ఎందుకు ఇచ్చాడో తెలుసా?

రవీంద్ర జడేజా టెస్ట్ జర్సీ
కాగా.. ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్టు(Ind Eng Test)కు జడేజా దూరమయ్యే అవకాశం ముంది. మూడో టెస్టు రెండో రోజున(ఆగస్టు 28న) ఫీల్డింగ్ చేస్తుండగా జడ్డూ మోకాలికి గాయమైంది. ఈ గాయానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు జడేజాను లీడ్స్‌లోని ఆస్పత్రికి తరలించారు.