టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ఫిట్నెస్ను నిరూపించేందుకు తమిళనాడుతో జరిగే సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ పోరులో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ ఫార్మాట్లో అర్హత పొందాలంటే దేశీయ క్రికెట్లో జడేజా సత్తా చాటాలని బోర్డు అధికారులు తెలిపారు. కాగా, గతేడాది సెప్టెంబరులో కుడి మోకాలికి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం ఆసియా కప్‌కు దూరమయ్యాడు జడ్డూ. అయితే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో(ఎన్సీఏ) కోలుకున్న జడేజా ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే 4 టెస్టుల సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపిక చేసిన 17 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
అయితే, అతడి స్థానం ఖరారు కావాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 24 నుంచి చెన్నైలో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు జడేజా సన్నద్ధమయ్యాడు. సౌరాష్ట్ర తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. జడేజాకు ఎన్సీఏలో చికిత్స పూర్తయినందున ఈ వారమే బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్‌గా అయిన జడేజా.. జట్టులో కీలకంగా మారతాడని యాజమాన్యం భావిస్తోంది. ఇక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ ఆసీస్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పంత్ స్థానంలో జడేజాను ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నరు.