తెలంగాణ

telangana

ETV Bharat / sports

'చిన్నప్పుడు బ్యాటర్​ అవుదామనుకున్నా' - రవిచంద్రన్​ అశ్విన్

Ravichandran Ashwin: దిగ్గజ ఆటగాడు కపిల్​దేవ్​ స్ఫూర్తితో బ్యాటర్​, మీడియం పేసర్​ కావలనుకున్నాని అన్నాడు స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్. భారత దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​ రికార్డును అధిగమించడంపై స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ స్పందించాడు.

Ravichandran Ashwin
రవిచంద్రన్​ అశ్విన్​

By

Published : Mar 8, 2022, 11:05 PM IST

Ravichandran Ashwin: భారత దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​ రికార్డును అధిగమించడంపై స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ స్పందించాడు. తాను చిన్నపుడు కపిల్​దేవ్​ స్ఫూర్తితో బ్యాటర్​తో పాటు మీడియం పేస్​ బౌలర్ కావాలనుకున్నాని అన్నాడు. 35 ఏళ్ల అశ్విన్ తన 85వ టెస్టులోనే కపిల్​దేవ్​ 434 వికెట్ల రికార్డును అధిగమించాడు. దీంతో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్​గా రికార్డు సృష్టించాడు.​ ​

"దీనిని చాలా గౌరవంగా భావిస్తున్నాను. 28 ఏళ్ల క్రితం రిచర్డ్ హడ్లీ రికార్డును కపిల్​దేవ్​ అధిగమించినప్పుడు నాన్నతో కలిసి ఎంజాయ్ చేశా. ఆయన సాధించిన రికార్డును అధిగమిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి బ్యాటర్​ అవ్వాలని అనుకున్నాను. 1994లో సచిన్​ తెండూల్కర్​ వెలుగులోకి వస్తున్న సమయం అప్పుడు నాకు బ్యాటింగ్​ అంటేనే ఆసక్తి. కపిల్​దేవ్​ గొప్ప స్ట్రైకర్​.మా నాన్న సలహాతో మొదటగా మీడియం పేస్​ బౌలర్​గా మారి మరో కపిల్​దేవ్​​ అవ్వాలి అనుకున్నా. కానీ తర్వాత ఆఫ్​ స్పిన్నర్​గా మారి భారత్​కు ప్రాతినిథ్యం వహించాను. భారత్​కు ఆడతానని ఎప్పుడు అనుకోలేదు. ఈ ఘనత సాధించింనందుకు చాలా ఆనందంగా ఉంది."

-రవిచంద్రన్​ అశ్విన్​

కపిల్​దేవ్​ 131 మ్యాచుల్లో 434 వికెట్లు తీయగా.. అనిల్​కుంబ్లే 132 మ్యాచుల్లో 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత తరఫున 400 వికెట్లకు పైగా సాధించిన నాలుగో బౌలర్​గా, అంతర్జాతీయంగా తొమ్మిదో ఆటగాడిగా రికార్డు సృష్టించారు.

ఇదీ చదవండి: IPL 2022: ఈ సీజన్​లోనూ సీఎస్కేనే ఫేవరేట్​!

ABOUT THE AUTHOR

...view details