WTC Final 2023 Team India : టీమ్ఇండియా పదేళ్లుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోవడానికి.. ధోనీ స్టైల్‌ను ఫాలో కాకపోవడమే కారణమని కూడా భారత జట్టు ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల బాధ తనకు అర్థమవుతోందని.. అయితే ప్లేయర్స్‌ను తరచూ జట్టులో ఉంచడం, తీసేయడం వల్ల ట్రోఫీలు గెలవడం సాధ్యం కాదని తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగానే ధోనీ గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ దరావిడ్కు తీరుపై చురకలంటించాడు. యాషెస్ మొదటి టెస్ట్ గెలిచిన ఆస్ట్రేలియాను అభినందిస్తూ.. తన యూట్యూబ్ షోలో మాట్లాడిని అశ్విన్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.
'పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేదు.. కారణం అదే'.. రోహిత్, ద్రవిడ్‌కు అశ్విన్ చురకలు! - ధోనీ ఎన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు
WTC Final 2023 Team India : భారత జట్టు పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడానికి అదే కారణమని టీమ్ఇండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తీరుపై పరోక్షంగా చురకలంటించాడు.

ICC Trophies Won By Dhoni : పదేళ్లుగా టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. దీంతో ధోనీపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అభిమానులు. దీనిపై స్పందించిన అశ్విన్.. ప్లేయర్లకు భద్రత కల్పించడమే ధోనీ విజయానికి కారణం అని అన్నాడు. "పదేళ్లుగా టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది. ఫ్యాన్స్ బాధ ఏంటో నాకు తెలుసు. అయితే వారు ఓ ప్లేయర్‌ను తీసేయాలని, మరో ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక ప్లేయర్ క్వాలిటీ రాత్రికి రాత్రే మారిపోదు. మనం ధోనీ నాయకత్వం గురించి మాట్లాడుకుంటాం. అతడు ఏం చేశాడు? అది చాలా సింపుల్. అతడి సారథ్యంలో నేను ఆడినప్పుడు జట్టులో ఓ 15 మందిని తీసుకునేవాడు. ఆ 15 మంది తుది జట్టే.. ఆ ఏడాది మొత్తం ఆడేది. ఓ ప్లేయర్‌కు అలాంటి భద్రత అనేది చాలా ముఖ్యం" అని అశ్విన్ కుండబద్దలుగొట్టాడు.
అయితే, ఏదైనా విషయాన్ని నిక్కచ్చిగా చెప్పే అశ్విన్.. ప్లేయర్ల అభద్రతాభావం గురించి గడిచిన రెండు వారాల్లో రెండోసారి మాట్లాడాడు. "నేను ఎక్కువగా ఆలోచిస్తానని చాలా మంది నాపై ఓ ముద్ర వేశారు. ఓ ప్లేయర్ వరుసగా 15-20 మ్యాచ్‌లు ఆడినప్పుడు అతడు మానసికంగా అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రెండు, మ్యాచ్‌లు మాత్రమే ఆడే ప్లేయర్ బాధపడటం, అతిగా ఆలోచించడం సహజంగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు 15 మ్యాచ్‌లు వరసగా ఆడతావు.. నీ బాధ్యత ఇది.. నీకు కెప్టెన్సీ ఇస్తాము అంటే నేను అతిగా ఆలోచించను. అంతే కదా?" అని అశ్విన్ స్పష్టం చేశాడు.