తెలంగాణ

telangana

ETV Bharat / sports

జంపా మన్కడింగ్​పై అశ్విన్ కామెంట్స్​.. ప్రతిసారి చెప్పడం నా వల్ల కాదంటూ.. - రవిచంద్రన్​ అశ్విన్​ జంపా మన్కడింగ్​

బిగ్‌బాష్ లీగ్‌లో మన్కడింగ్​ చేయబోయి బోల్తా పడిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపాపై స్పందించాడు భారత ఆఫ్​స్పిన్నర్​ రవిచంద్ర అశ్విన్. ఏం అన్నాడంటే..

Ravichandran Ashwin Zampa Mankading
జంపా మన్కడింగ్​పై అశ్విన్ కామెంట్స్​.. ప్రతిసారి చెప్పడం నా వల్ల కాదంటూ..

By

Published : Jan 7, 2023, 4:09 PM IST

భారత ఆఫ్​స్పిన్నర్​ రవిచంద్ర అశ్విన్ లాగే.. ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ జంపా కూడా ఇటీవలే బిగ్‌బాష్ లీగ్‌లో మన్కడింగ్​ చేయబోయి బోల్తా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై రవిచంద్రన్ అశ్విన్ సరదాగా స్పందించాడు.

"ఇలా రనౌట్‌ గురించి మాట్లాడటానికి, రాయడానికి నాకంత ఓపిక లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు దీనిపై చర్చించడంతో అలసిపోయా. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతిసారి చెప్పడం నా వల్ల కాదు. దాని కోసం ప్రత్యేకంగా కొందరు ఉంటారు. అయితే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే.. నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేసిన తర్వాత ఆడమ్‌ జంపా ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుండిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌ గుర్తుకొచ్చాడు. బ్యాటర్‌ను ఒక్క మాట అనకుండా అనలేదు. ఇది ఔటైనా.. లేదా అనే సందిగ్ధంలో ఉన్న నాన్‌స్ట్రైకర్‌ కూడా సైలెంట్‌గా ఉండిపోయాడు. అయితే బయట (అభిమానులు, విశ్లేషకులు) నుంచి మాత్రం అది లీగల్ డెలివరీనా...? కాదా..? అనే చర్చించుకోవడం ఖాయం. అయితే అతడు బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తైనట్లుగా అనిపించింది" అని అశ్విన్‌ వివరించాడు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్‌లో అశ్విన్, జంపా ఇద్దరూ రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫునే ఆడుతున్నారు.

క్రికెట్ చట్టాలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్ క్లబ్ కూడా వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. ఠబౌలర్‌ బంతిని విసిరేందుకు సిద్ధమై వచ్చేటప్పుడు నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ను దాటి ముందుకు వెళ్తే... అప్పుడు బౌలర్‌ బంతిని వికెట్ల తాకిస్తే నాన్‌స్ట్రైకర్‌ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరతాడు. అలా కాకుండా బౌలర్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ను అన్ని విధాలుగా పూర్తి చేసేసి.. బంతిని విడవకుండా నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయాలని చూస్తే మాత్రం అది నాటౌట్‌గా ప్రకటించడం జరుగుతుందిఠ అని ఎంసీసీ ట్వీట్ చేసింది.

ఇదీ చూడండి:'వార్నర్‌.. మీరు తెలుగు సినిమాల్లో నటించొచ్చుగా'

ABOUT THE AUTHOR

...view details