తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కపిల్​ రికార్డును అధిగమిస్తానని అనుకోలేదు' - కపిల్​దేవ్

Ravichandran Ashwin: తాను ఎప్పుడు కపిల్​దేవ్​ రికార్డును అధిగమిస్తానని అనుకోలేదన్నాడు స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. భారత్​ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా రికార్డు సృష్టించడంపై అశ్విన్​ స్పందించాడు.

Ravichandran Ashwin
రవిచంద్రన్​ అశ్విన్

By

Published : Mar 6, 2022, 10:25 PM IST

Ravichandran Ashwin: భారత దిగ్గజ ఆటగాడు కపిల్​దేవ్​ రికార్డును అందుకోవడంపై స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ స్పందిచాడు. తాను ఎప్పుడు ఈ రికార్డును చేరుకుంటానని అనుకోలేదన్నాడు. భారత్​ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్​గా అశ్విన్​ రికార్డు సృష్టించాడు.

"28 ఏళ్ల క్రితం కపిల్​దేవ్​ ఈ రికార్డును సాధించాలని కోరుకున్నాను. నేనేప్పుడూ ఆఫ్​ స్పిన్నర్​ని అవుతానని, నా దేశం కోసం ఆడతానని అనుకోలేదు. ఇలాంటి గొప్ప వ్యక్తుల రికార్డులను దాటుతానని ఊహించలేదు. ఇప్పటి వరకు సాధించిన దాని పట్ల చాలా సంతోషంగా ఉన్నాను."

-రవిచంద్రన్​ అశ్విన్​

ఆదివారం శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా 435 వికెట్లతో సుదీర్ఘ ఫార్మాట్​లో భారత తరపున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే కపిల్​ను (131 మ్యాచ్​ల్లో 434 వికెట్లు) అధిగమించాడు. తన 85వ మ్యాచ్​లోనే అశ్విన్​ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ జాబితాలో 132 మ్యాచ్​ల్లో 619 వికెట్లతో స్పిన్ దిగ్గజం అనిల్​ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్​లో భారత్​ ఇన్నింగ్స్​ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 578/8 పరుగులకు డిక్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా (175*) దంచికొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 174 పరుగులకే కుప్పకూలడంతో ఫాలోఆన్‌ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ లంకేయులు 178 పరుగులకే చేతులెత్తేశారు.

ఇదీ చదవండి:Rohit Sharma: 'కోహ్లీ కోసం గెలవాలనుకున్నాం'

ABOUT THE AUTHOR

...view details