Ravichandran Ashwin corona postive: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడ్డాడు. అతడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టెస్టు జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకొని సాధన ప్రారంభించింది. ఈ క్రమంలోనే తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ పూర్తయ్యాక హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ సోమవారం బయలుదేరి వెళ్లారు.
అశ్విన్‌కు కరోనా.. ఇంగ్లాండ్ టెస్టుకు ఆలస్యంగా పయనం - రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్
Ravichandran Ashwin corona postive: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ఆలస్యంగా బయలుదేరనున్నాడు.
![అశ్విన్‌కు కరోనా.. ఇంగ్లాండ్ టెస్టుకు ఆలస్యంగా పయనం aswin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15615735-thumbnail-3x2-aswhin.jpg)
అయితే, అశ్విన్ గతనెల భారత టీ20 లీగ్‌లో రాజస్థాన్ తరఫున ఆడాక బయోబబుల్ వీడి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ డివిజన్ 1 లీగ్ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే అతడికి కరోనా సోకడం వల్ల ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. అందువల్లే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ టీమ్‌ఇండియాతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లలేదని, కొవిడ్ నుంచి కోలుకున్నాక ప్రొటోకాల్ ప్రకారం అక్కడికి బయలుదేరతాడని చెప్పారు. అయితే, శుక్రవారం నుంచి లీకెస్టైర్‌షైర్‌తో ప్రారంభమయ్యే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు అశ్విన్ అందుబాటులో ఉండడని అన్నారు. జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్ కల్లా అతడు జట్టుతో కలుస్తాడని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Team India: సీనియర్లు హిట్.. జూనియర్లు ఫట్!